Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Jun 22 , 2024 | 06:00 PM

ప్రస్తుత సోషల్ మీడియా యగంలో ఎక్కడ ఏ విచిత్ర ఘటన జరిగినా, తమాషా సంఘటన జరిగినా లేదా షాకింగ్ ఘటన చోటు చేసుకున్నా.. ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వాటిలో కొన్ని...

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ప్రస్తుత సోషల్ మీడియా యగంలో ఎక్కడ ఏ విచిత్ర ఘటన జరిగినా, తమాషా సంఘటన జరిగినా లేదా షాకింగ్ ఘటన చోటు చేసుకున్నా.. ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని తెగ నవ్విస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ రైతు తన గేదె రాత్రివేళల్లో మేత మేసేందుకు వీలుగా వినూత్న ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు తన పశువుల పట్ల తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు. తన గేదెలు రాత్రిళ్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేత మేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. ఇందుకోసం చివరకు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. గేదె కొమ్ముల తలకు (light installed on buffalo head) ఓ పెద్ద టార్చిలైట్ కట్టేశాడు. బ్యాటరీతో నడిచే ఆ లైటును ఆన్ చేయగానే.. గేదె ఎటు తల తిప్పితే అటు వెలుతురు పడుతోంది.

Viral video: గుండెల్ని పిండేసే వీడియో.. మందలిస్తున్న మావటిని.. ఈ ఏనుగు చివరకు..


తలపై లైటు వెలుగుతున్నా కూడా గేదె ఎలాంటి భయం లేకుండా మేత మేయడం కనిపించింది. ఇలా తన గేదె కోసం వినూత్నంగా ఆలోచించిన రైతును చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ నవ్వుకుంటున్నారు. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇతడికి గేదెలంటే ఎంత ఇష్టమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: వాడకం అంటే ఇదీ.. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో.. యువతి జుట్టును ఎలా మార్చాడంటే..

Updated Date - Jun 22 , 2024 | 06:00 PM

Advertising
Advertising