Viral: పూలతో నిండిన అంబులెన్స్.. ఊరేగింపుగా ఊర్లోకి రావడంతో అంతా షాక్.. చివరకు ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం తెలిసి..
ABN, Publish Date - Mar 29 , 2024 | 06:26 PM
కొందరు చేసే పనులు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటాయి. మరికొందరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా అభినందించే విధంగా ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూలతో అలంకరించిన అంబులెన్స్ ఊర్లోకి ఊరేగింపుగా రావడం చూసి..
కొందరు చేసే పనులు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటాయి. మరికొందరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా అభినందించే విధంగా ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూలతో అలంకరించిన అంబులెన్స్ ఊర్లోకి ఊరేగింపుగా రావడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు గ్రామంలోని ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం తెలుసుకుని అంతా అభినందనలతో ముంచెత్తారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఖాండ్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రంఝానీ గ్రామానికి చెందిన సౌరభ్ భార్గవ భార్య కడుపుతో ఉంది. ఈమెకు ఇటీవల ఓ రోజు ఉన్నట్టుండి పురటినొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియగానే తల్లితో పాటూ తండ్రి కూడా ఎంతో సంతోషించాడు. భార్యను డిశ్చార్జి చేసే రోజు భర్త వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పూలతో అలంకరించిన అంబులెన్స్‌లో (ambulance decorated with flowers) డప్పు వాయిద్యాల మధ్య కూతురును ఊరేగింపుగా గ్రామానికి తీసుకెళ్లాడు.
Viral: మనువరాలితో కలిసి బస్సు ఎక్కిన మహిళకు షాక్ ఇచ్చిన కండక్టర్.. కారణమేంటని విచారిస్తే..
బాణసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపుగా వస్తున్న అంబులెన్స్‌ను చూసి గ్రామస్తులంతా మొదట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని అంతా కలిసి భార్గవను అభినందనలతో ముంచెత్తారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే చెత్తకుప్పల్లో పడేయడం, అబార్షన్లు చేయించే వాళ్లు ఉన్న ప్రస్తుత సమాజంలో ఇలా పండుగ చేసుకునే తండ్రిని చూసి చుట్టు పక్కల వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఆడపిల్లల తల్లిదండ్రులు.. ఇతన్ని ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘మీరు నిజంగా ఎంతో గ్రేట్ బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: తాబేలు పవర్ ఏంటో తెలీక కొరకబోయిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
Updated Date - Mar 29 , 2024 | 06:26 PM