Share News

Viral: నాణ్యతాలోపాలున్న వస్తువుల డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్!

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:25 PM

నాణ్యతాలోపాలున్న వస్తువులను కస్టమర్‌కు డెలివరీ చేసిన ఫ్లిప్‌కార్ట్‌కు ముంబైలోని వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. నో రిటర్న్ పాలసీ సాకుతో లోపాలున్న వస్తువులను వెనక్కు తీసుకోకపోవడం అన్యాయమైన వ్యాపార పద్ధతని అభివర్ణించింది.

Viral: నాణ్యతాలోపాలున్న వస్తువుల డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: నాణ్యతాలోపాలున్న వస్తువులను కస్టమర్‌కు డెలివరీ చేసిన ఫ్లిప్‌కార్ట్‌కు ముంబైలోని వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. నో రిటర్న్ పాలసీ సాకుతో లోపాలున్న వస్తువులను వెనక్కు తీసుకోకపోవడం అన్యాయమైన వ్యాపార పద్ధతని అభివర్ణించింది. బాధిత మహిళకు ఆమె డబ్బులను వడ్డీతో సహా తిరిగివ్వాలంటూ ఆదేశించింది (Viral).

Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..

పూర్తి వివరాల్లోకి వెళితే, గోరేగావ్ ప్రాంతానికి చెందిన తరుణ రాజ్‌పుత్, అక్టోబర్ 9న ఫ్లిప్‌కార్ట్ నుంచి హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్‌కు చెందిన 13 కంటెయినర్లను రూ.4,641 చెల్లించి ఆర్డరిచ్చింది. కానీ, డెలివరీ అయిన వస్తువులను చూసి ఆమె హతాశురాలైంది. ఆ కంటెయినర్లలో కొన్నింటి లేబుల్స్‌పై క్యూఆర్ కోడ్ లేకపోవడం, ద్రావణం రుచి, రంగులో కూడా తేడా ఉండటాన్ని గుర్తించింది.


Personal Finance: మీ నెల జీతం రూ. లక్షన్నరా? ఇంతకు మించి ఖరీదైన ఇల్లు మాత్రం కొనొద్దు!

దీంతో, తనకు నాణ్యత తక్కువగా ఉన్న వస్తువులు సరఫరా అయ్యాయని గుర్తించిన ఆమె వెంటనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించింది. జరిగిన విషయమంతా చెప్పి, వాటిని తిరిగిచ్చే ప్రయత్నం చేసింది. కానీ కంపెనీ మాత్రం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. తాము ఆ కంటెయినర్ల విషయంలో నో రీటర్న్ పాలసీని ఫాలోవుతామని, కాబట్టి, డెలివరీ అయిన వస్తువులను వెనక్కు తీసుకునేది లేదని చెప్పింది.

Viral: ఇదేం ఐడియారా బాబూ! రోడ్డుపై గాల్లో తేలుతున్నట్టు ఇల్లు కడుతున్నారుగా!

ఫ్లిప్‌కార్ట్ జవాబుతో అసంతృప్తికి లోనైన మహిళ చివరకు ముంబైలోని వినియోగదారుల ఫోరంను ఆశ్చర్యయించింది. ఫ్లిప్‌కార్ట్‌తో జరిపిన టెక్స్ట్‌ మెసేజీల సంభాషణ వివరాలను కోర్టుకు సమర్పించింది.


అన్నీ పరిశీలించిన న్యాయస్థానం మహిళ వాదనతో ఏకీభవించింది. ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ‘‘నో రిటర్న్ పాలసీ కింద నాణ్యతాలోపాలున్న వస్తువులను వెనక్కు తీసుకోకపోవడం అన్యాయమైన వ్యాపార పద్ధతి. లోపాలనున్న వస్తువులకు బదులు కొత్త వాటిని ఇవ్వకపోవడం లేదా వాటి డబ్బును తిరిగి చెల్లించకపోవడం సేవాలోపమే’’ అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, మహిళ చెల్లించిన డబ్బును 9 శాతం వడ్డీ కూడా కలిపి తిరిగి చెల్లించాలని, లీగల్ ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు వెలువరించింది. అయితే, తనకు జరిగిన నష్టానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలన్న మహిళ పిటిషన్‌ను మాత్రం కొట్టివేసింది.

Viral: పెళ్లి వేదిక మీదే వరుడితో వధువు తెగదెంపులు! కారణం తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Nov 28 , 2024 | 03:32 PM