Viral: అసలే కన్ఫ్యూజన్‌లో ఉన్న అడవి దున్నను రెచ్చగొట్టేసరికి..
ABN, Publish Date - Apr 09 , 2024 | 03:37 PM
ఓ వ్యక్తి అడవి దున్నను రెచ్చగొట్టడంతో అది అతడిని గాల్లోకి విసిరేసింది. అదృష్టవశాత్తూ అతడికి గాయాలేమీ కాకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అసలే అది అడవి దున్న.. ఆపై కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అలాంటి దాన్ని రెచ్చగొట్టి చావుతో చెలగాటమాడాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (Viral) మారింది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలోని వ్యక్తి తన మూర్ఖత్వంతో ఎంతటి ప్రమాదంలో పడ్డాడో చూసి జనాలు షాకైపోతున్నారు. జనాల్లో మార్పు ఎందుకు రావట్లేదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియరానప్పటికీ జనాలు మాత్రం వీడియో చూసి స్టన్ అయిపోతున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ అడవి దున్న తప్పిపోయి జనావాసాల మధ్యకు వచ్చేసింది. భారీ ఆకారంతో ఉన్న దాన్ని చూసి అక్కడి వారు చెల్లాచెదురయ్యారు. ఇళ్లల్లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇలాంటి టైంలో ఓ వ్యక్తి అడవి దున్నవైపు వచ్చాడు.
Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో
కొత్త ప్రదేశం కారణంగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న దున్నవైపు వేగంగా నడుస్తూ దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దూరం నుంచి ఇదంతా మొబైల్‌లో రికార్డు చేస్తున్న కొందరు వారిస్తున్నా అతడు వినలేదు. తనవైపు ఆగకుండా వస్తు్న్న వ్యక్తిని చూసి అపాయం ముంచుకొస్తోందని అడవి దున్న భావించింది. దీంతో, రెచ్చిపోయి ప్రతిదాడికి దిగింది. అతడి మీదకు దూసుకెళ్లి తలతో అతడిని ఎత్తి కిందపడేసింది. అయితే, దాని పదునైన కొమ్ములు అతడికి తగలకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. దున్న దెబ్బకు బుద్ధిరావడంతో అక్కడి నుంచి జారుకున్నాడు (Furious Gaur Attacks man).
ఈ వీడియోను షేర్ చేసిన పర్వీన్ కాస్వాన్.. తమ బృందం అక్కడికి చేరుకునేసరికే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. ఎప్పుడేం చేస్తాయో తెలియని అడవి జంతువులతో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అడవి దున్నలైతే ఏ క్షణానైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. అడవి జంతువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 09 , 2024 | 03:43 PM