Viral: ఆరేళ్ల క్రితం చనిపోయాడనుకున్న బిలియనీర్.. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలిసి అందరికీ షాక్..
ABN, Publish Date - Apr 18 , 2024 | 06:20 PM
సుమారు ఆరేళ్ల క్రితం చనిపోయాడనుకున్న అమెరికా బిలియనీర్ కార్ల్ ప్రస్తుతం రష్యా గూఢచారి అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో అక్కడే ఉంటున్నాడని తెలిసి అంతా షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సుమారు ఆరేళ్ల క్రితం జర్మనీ సంతతికి చెందిన ఓ అమెరికా బిలియనీర్ అదృశ్యమయ్యాడు. అతడు చనిపోయాడనే అంతా అనుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ఎందుకు అదృశ్యమయ్యాడో తెలుసుకున్న కుటుంబసభ్యులు నోరెళ్లపెడుతున్నాడు. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ (US Billionaire) కార్ల్ ఎరివాన్ హబ్ (58) (Karl Erivan Haub).. రిటైల్ రంగ దిగ్గజ సంస్థ టాంగెల్మెన్ గ్రూపుకు అధినేత. సంస్థలో 75 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లో కార్ల్ స్కీయింగ్ కోసం స్విట్జర్‌ల్యాండ్‌కు (Switzerland) వెళ్లి కనిపించకుండా పోయారు. కార్ల్ జాడ కోసం అధికారులు ఆరు రోజుల పాటు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. మరోవైపు, సంస్థ బాధ్యతలను కార్ల్ సోదరుడు క్రిస్టియన్ తీసుకున్నాడు.
Viral: 20 నిమిషాల పని.. ఏడాదికి లక్షల్లో లాభాలు.. యువకుడిని సంపన్నుడిగా మార్చిన సైడ్ బిజినెస్!
ఇదిలా ఉంటే కార్ల్ అదృశ్యమైన ఘటన వెనక కారణాలను వెలికితీసేందుకు జర్మన్ బ్రాడ్‌కాస్టర్ ఆర్‌టీఎల్ రంగంలోకి దిగింది. ఆయన అదృశ్యం కావడానికి ముందు ఏం జరిగిందో ఆరా తీసింది. ఈ క్రమంలో రష్యా మహిళ ఎర్మిలోవాతో ఆయన పలుమార్లు గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడినట్టు బయటపడింది. ఈ దిశగా మరింత లోతైన దర్యాప్తు చేసిన ఆర్టీఎల్.. బిలియనీర్ రష్యాలో తన గర్ల్ ఫ్రెండ్ ఎర్మిలోవాతో ఉంటున్నట్టు గుర్తించింది. కొన్నేళ్లుగా వారి మధ్య సంబంధం ఉందని, 2008లోనే వారు మాస్కో, సోచీల్లో కనిపించారని తెలిపింది (German US Billionaire Who Was Declared Dead Found Living With His Mistress In Moscow).
కార్ల్ ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో ఆమె ఉండేదని వివరించింది. ఎర్మిలోవా వాస్తవానికి రష్యా గూఢచారి అని, ఆమె సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వివిధ ఔట్‌డోర్ క్రీడల ఈవెంట్లను చేపట్టే సంస్థను నిర్వహించేదని తెలిపింది. రష్యా (Russia) వనితతో కార్ల్ ఏదైనా అనుమానాస్పద బిజినెస్ డీలింగ్స్ కూడా నెరపి ఉండొచ్చని పేర్కొంది. అయితే, స్వీట్జర్‌లాండ్ నుంచి సదరు బిలియనీర్ రష్యా ఎలా చేరుకున్నాడో మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 06:58 PM