Viral Video: వామ్మో..! నీళ్లు తాగడం ఇంత కష్టమా.. ఈ జిరాఫీ పడుతున్న ఇబ్బందులు చూస్తే..
ABN, Publish Date - Mar 31 , 2024 | 03:14 PM
సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి.. అన్న సామెత చందంగా.. మనుషులైనా, జంతువులైనా ఎవరికి తగ్గ ఇబ్బందులు వారికి ఉంటాయి. ఎంత పెద్ద వారైనా వారి స్థాయిలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే ఎంత పెద్ద జంతువైనా దానికీ అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. సోషల్ మీడియాలో...
సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి.. అన్న సామెత చందంగా.. మనుషులైనా, జంతువులైనా ఎవరికి తగ్గ ఇబ్బందులు వారికి ఉంటాయి. ఎంత పెద్ద వారైనా వారి స్థాయిలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే ఎంత పెద్ద జంతువైనా దానికీ అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వీడియోలు.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీళ్లు తాగే సమయంలో ఓ జిరాఫీ పడుతున్న ఇబ్బందులు, జాగ్రత్తలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
పొడవాటి కాళ్లు ఉన్న జిరాఫీకి కొమ్మలు వంచి ఆకులు తినేయడం ఎంతో సులభం. కానీ అదే జిరాఫీ నీరు తాగాలంటే మాత్రం కొన్నిసార్లు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే (Viral video) ఇందుకు నిదర్శనం. ఓ పెద్ద జిరాఫీ (Giraffe) నీరు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వస్తుంది. నీటి ఒడ్డున కాళ్లను అటూ ఇటూ దరంగా పెట్టి నీళ్లు తాగేందుకు మెడను కిందకు వంచే ప్రయత్నం చేస్తుంది. అయితే బరువైన తన శరీరం కారణంగా ఓ కాలు బురదలో జారిపోతుంది. బ్యాలెన్స్ తప్పి పడిపోతుందనుకున్న తరుణంలో వెంటనే అలెర్ట్ అయిన జిరాఫీ.. కాలు వెనక్కు తీసుకుని పక్కకు వెళ్తుంది.
Viral Video: వామ్మో..! ఇది నోరా.. లేక నీటి కొళాయా..
నీళ్లు తాగేందుకు అనువైన ప్రదేశం కోసం.. కాస్త దూరం వెళ్తుంది. ఈసారి కాళ్లు జారకుండా గట్టి పట్టు ప్రదేశంలో నిలబడుతుంది. తర్వాత వెంటనే నీళ్లు తాగేయకుండా.. శత్రువులు ఎవరైనా వస్తున్నారేమో అని అటూ ఇటూ చూస్తుంది. ఎవరూ రాలేదని నిర్ధారించుకున్నాక.. మెడను వంచి తాపీగా నీళ్లు తాగేస్తుంది. నీళ్లు తాగడంలో జిరాఫీకి ఎదురైన ఈ ఇబ్బందులు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! ఈ జిరాఫీకి నీళ్లు తాగడం కూడా కష్టమైపోయిందే’’.. అంటూ కొందరు, ‘‘పొడవాటి కాళ్లే చివరికి సమస్యగా మారాయి’’.. అంటూ మరికొందరు వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం రెండు వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: విమానాశ్రయాన్ని కూడా వదల్లేదు.. లగేజీ ట్రాక్‌పై ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే..
Updated Date - Mar 31 , 2024 | 03:14 PM