Viral Video: కారులో ‘‘ఒకే ఒక్కడు’’ సాంగ్ వినగానే.. బైకులో బాలిక రియాక్షన్ చూసి అంతా షాక్..
ABN, Publish Date - Jul 09 , 2024 | 05:51 PM
ప్రస్తుతం ఏమూరుమూల ప్రాంతాల్లో సైతం చీమ చిటుక్కుమన్నా కూడా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇక వాటిలో విచిత్ర ఘటనల వీడియోలైతే మరింత వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలను చూసినప్పుడు ఆనందం కలిగితే.. మరికొన్ని...
ప్రస్తుతం ఏమూరుమూల ప్రాంతాల్లో సైతం చీమ చిటుక్కుమన్నా కూడా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇక వాటిలో విచిత్ర ఘటనల వీడియోలైతే మరింత వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలను చూసినప్పుడు ఆనందం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఇంకొన్ని వీడియోలైతే.. అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కారులో ఒకే ఒక్కడు సినిమాలోని పాట వినగానే ముందు వైపు వెళ్తున్న బైకులో వెనుక కూర్చున్న బాలిక రియాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారులో (car) వెళ్తున్న కొందరు యువకులు మార్గ మధ్యలో ఒకే ఒక్కడు సినిమాలోని (oke okkadu movie song) పాటలు వింటుంటారు. ‘‘ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు.. వడ్డించ నువ్వు చాలు నాకు’’.. అంటూ ఆ సినిమాలోని ఓ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కారుకు ముందు వైపు బైకులో వెళ్తున్న వారు ఈ పాటను వింటుంటారు.
Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..
అయితే అదే బైకులో వెనుక వైపు కూర్చున్న ఓ బాలిక.. ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేస్తుంది. అంతటితో ఆగకుండా కూర్చునే (girl danced on the bike) డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బైక్‌కు ఓ వైపు వంగిపోయి, చేతులు అటూ ఇటూ తిప్పుతూ డాన్స్ చేస్తుంది. బాలిక నిర్వాకం చూసి కారులో ఉన్న వారు షాక్ అవుతారు. బాలిక ఎక్కడ కిందపడిపోతుందో అని కంగారుపడతారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Viral Video: అవ్వ చేసిన పనికి అవాక్కవుతున్న జనం.. మేకతో ఆమె నిర్వాకం చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బాలిక డాన్స్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..
Updated Date - Jul 09 , 2024 | 05:51 PM