Viral video: చూసేందుకు స్కూల్ పిల్లలే అయినా.. రోడ్డుపై ఈ బాలికల నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Jun 25 , 2024 | 09:20 PM

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ చాలా మంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు..

Viral video: చూసేందుకు స్కూల్ పిల్లలే అయినా.. రోడ్డుపై ఈ బాలికల నిర్వాకం చూస్తే..

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ చాలా మంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఏదోటి చేసి నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏదోవే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. కొందరు బాలికలు కూడా బస్సులు, రైళ్లు, రద్దీ ప్రదేశాల్లో వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇద్దరు బాలికలు చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్కూల్‌కు వెళ్తున్న బాలికలు.. రద్దీ రోడ్డుపై విన్యాసం చేస్తుండగా చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు బాలికలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో రద్దీ రోడ్డుపై విన్యాసాలు (Girls stunts on the road) చేసేందుకు సిద్ధమవుతారు. వారికి ఎదురుగా మరో ఇద్దరు బాలికలు కారు పక్కగా నిలబడి చూస్తుంటారు. ఇంతలో విన్యాసం చేసేందుకు సిద్ధమైన ఇద్దరు బాలికల్లో ఒకరు మరో బాలిక భుజాలపైకి ఎక్కుతుంది. చేతుల సాయంతో ఆమె భుజాలపై నిలబడుతుంది. తర్వాత సినిమా స్టంట్స్ తరహాలో పైకి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి కింద నిలబడేందుకు ప్రయత్నిస్తుంది.

Viral video: మేడపై పని చేస్తుండగా షాకింగ్ ఘటన.. పొరపాటున ఆమె సబ్బుపై కాలేయడంతో..


గాలిలో పల్టీలు అయితే కొట్టింది గానీ.. నేలపై నిలబడే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి.. ధబేల్‌మని కిందపడిపోతుంది. దీంతో గట్టిగా కేకలు పెడుతూ ఏడుస్తుంది. పక్కనే ఉన్న ఆమె స్నేహితులంతా చుట్టూ చేరి ఓదారుస్తుంటారు. అయితే అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సాధ్యం కానీ పనులు చేయాలని చూస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాకర విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

Updated Date - Jun 25 , 2024 | 09:36 PM

Advertising
Advertising