Viral Video: ప్రియుడిని రమ్మని పిలిచిన యువతి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అతని తల్లి..!
ABN, Publish Date - May 19 , 2024 | 01:22 PM
ప్రియుడి కోసం అతని ఇంటి బయట స్కూటీపై ఎదురు చూస్తున్న యువతికి.. ప్రియుడి తల్లి బిగ్ షాక్ ఇచ్చింది. రోడ్డు పక్కన ఉన్న యువతి వద్దకు సైలెంట్‌గా వెళ్లి పట్టుకుంది. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది. అసలింతకీ ఆ మహిళ ఆమెను ఎందుకు పట్టుకుంది? ఆ తరువాత ఏం చేసింది? వివరాలు తెలియాలంటే ఈ కథనం..
Watch Video: ప్రియుడి కోసం అతని ఇంటి బయట స్కూటీపై ఎదురు చూస్తున్న యువతికి.. ప్రియుడి తల్లి బిగ్ షాక్ ఇచ్చింది. రోడ్డు పక్కన ఉన్న యువతి వద్దకు సైలెంట్‌గా వెళ్లి పట్టుకుంది. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది. అసలింతకీ ఆ మహిళ ఆమెను ఎందుకు పట్టుకుంది? ఆ తరువాత ఏం చేసింది? వివరాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. వాస్తవానికి వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి.. తన ప్రియుడి ఇంటి వద్దకు వచ్చింది. అతన్ని బయటకు రమ్మని పిలిచి.. తాను బయట స్కూటీపై ఎదురు చూస్తూ ఉంది. కానీ, అక్కడే ప్లాన్ రివర్స్ అయ్యింది.
ప్రియుడు వస్తాడనుకుంటే.. అతని తల్లి బయటకు వచ్చింది. సైలెంట్‌గా యువతి వద్దకు వచ్చి.. యువతిని పట్టుకుంది. ఆమెతో ఘర్షణకు దిగింది. తన కొడుకుతో నీకేంటి పని అని ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా యువతి స్కూటీ తాళం తీసేసుకుంది. ఒక సమయంలో యువతిని కొట్టింది కూడా. ఈ ఊహించని పరిణామంతో యువతి సైతం షాక్ అయ్యింది. తాను ఎవరి కోసం రాలేదని, పనిమీద ఇక్కడికి వచ్చానని మహిళకు చెప్పే ప్రయత్నం చేసింది. అయితే, మహిళ ఊరుకుంటేనా.. రెచ్చిపోయి యువతిని చెడమడా తిట్టేసింది. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా.. ఆ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
For More Trending News and Telugu News..
Updated Date - May 19 , 2024 | 01:22 PM