ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఇదెలా సాధ్యం.. రాళ్లు పగులగొట్టగా మధ్యలో ఇతడికి దొరికిన వస్తువులేంటో చూడండి..

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:13 PM

తవ్వకాల్లో ఊహించని విధంగా పురాతన వస్తువులు బయటపడడం, పాత ఇళ్లు కూల్చుతుండగా బంగారు నాణేలు కనిపించడం, పొలం పనులు చేసుకుంటుండగా వజ్రాలు దొరకండం వంటి ఘటనల గురించి తరచూ వింటుంటాం. ఇలాంటి ..

తవ్వకాల్లో ఊహించని విధంగా పురాతన వస్తువులు బయటపడడం, పాత ఇళ్లు కూల్చుతుండగా బంగారు నాణేలు కనిపించడం, పొలం పనులు చేసుకుంటుండగా వజ్రాలు దొరకండం వంటి ఘటనల గురించి తరచూ వింటుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రాళ్లు పగులగొడుతుండగా.. మధ్యలో ఊహించని వస్తువులు బయటపడ్డాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో.. ఇదెలా సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాళ్లు పగులగొట్టే సమయంలో ఓ ప్రదేశంలో మెటల్ డిటెక్టర్‌తో (Metal detector) పరిశీలించగా సౌండ్ వస్తుంది. దీంతో అందులో ఏముందే చూసేందుకు అతను రాళ్లను పగులగొట్టడం మొదలెడతాడు. ఇందుకోసం డ్రిల్లింగ్ మిషిన్‌తో రాళ్లను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. మధ్య మధ్యలో సుత్తి సాయంతో మరింత లోతుగా తవ్వుతాడు. మళ్లీ మెటల్ డిటెక్టర్‌తో పరిశీలించగా.. సౌండ్ వస్తూనే ఉంటుంది. దీంతో ఇంకా లోతులోకి రాళ్లను తవ్వడం మొదలెడతాడు.

Viral video: చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. తీరా చూస్తే కాళ్లను చుట్టేసిన పాము.. చివరకు..


ఇలా రాళ్లన్నీ తవ్వుతుండగా.. ఉన్నట్టుండి అతడికి ఊహించని దృశ్యం కనిపిస్తుంది. ఏవో నాణేలు ఉన్నట్లు అనుమానం రావడంతో బయటికి తీస్తాడు. బయటికి తీసి చూడగా.. అవన్నీ (Gold coins) బంగారు నాణేలని తెలుస్తుంది. అయితే ఇదంతా చూసేందుకు నమ్మశక్యంగా లేకున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘రాళ్ల మధ్యలో బంగారు నాణేలు దొరకడం అసాధ్యం.. ఇది ఫేక్ వీడియో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: వధువు ఎదుటే వరుడితో ఆటలు.. చిర్రెత్తుకొచ్చిన పెళ్లికొడుకు చివరకు..

Updated Date - Jun 13 , 2024 | 04:13 PM

Advertising
Advertising