ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..

ABN, Publish Date - Aug 02 , 2024 | 09:39 AM

జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలు బీభత్సం సృష్టించడంతో పాటూ మనుషులు, వివిధ జంతువులపై దాడి చేయడం చూస్తుంటాం. సైలెంట్‌గా ఇళ్లల్లోకి చొరబడే పులులు కొన్నిసార్లు.. పిల్లులు, కోళ్లు, పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలు బీభత్సం సృష్టించడంతో పాటూ మనుషులు, వివిధ జంతువులపై దాడి చేయడం చూస్తుంటాం. సైలెంట్‌గా ఇళ్లల్లోకి చొరబడే పులులు కొన్నిసార్లు.. పిల్లులు, కోళ్లు, పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఓ చిరుత పులి సైలెంట్‌గా ఇంట్లోకి దూరింది. అదే సమయంలో అక్కడే ఉన్న పెంపుడు కుక్కలు గమనించడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో జూలై 31రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఓ చిరుత పులి సడన్‌గా సదరు ఇంట్లోకి వెళ్లాలని చూసింది. ఇంటి ముందున్న (leopard trying to enter home) గేటును తోసుకంటూ లోపలికి వచ్చింది.

Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. రైల్వే ట్రాక్స్‌పై ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..


అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మూడు పెంపుడు కుక్కలు పులిని గమనించాయి. అయితే లోపలికి వచ్చిన పులి.. వెంటనే భయపడి బయటికి వెళ్లాలని చూస్తుంది. అయితే ఆ వెంటనే మళ్లీ లోపలికి వచ్చి కుక్కలపై దాడి చేయాలని చూస్తుంది. అయితే పులి రాగానే కాస్త దూరం పారిపోయిన కుక్కలు దానిపై ఎదురు దాడి చేస్తాయి. దాన్ని వెనుకే పరుగెత్తి చాలా దూరం వరకూ (dogs chased away the leopard) తరిమి తరిమి కొడతాయి. కుక్కల దెబ్బకు చిరుత పులి భయంతో పారిపోతుంది. కుక్కల అరుపులు విని చివరగా ఇంటి యజమాని అక్కడికి వస్తాడు.

Viral Video: నిధి కోసం వెతుకుతుండగా... మోగిన మెటల్ డిటెక్టర్.. ఏముందా అని తవ్వి చూడగా.. షాకింగ్ సీన్..


చివరకు చిరుత పులిని చూసి భయపడి లోపలికి వెళ్లిపోతాడు. అయితే అప్పటికే పులిని కుక్కలు వెంటబడుతూ వెళ్లుంటాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులికి చుక్కలు చూపించిన కుక్కలు’’.. అంటూ కొందరు, ‘‘సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. మొత్తానికి పులిని తరిమి తరిమి కొట్టాయిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యువతి పక్కనే నిలబడి.. ఆమెకు తెలీకుండానే.. ఈ వృద్ధుడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Aug 02 , 2024 | 09:39 AM

Advertising
Advertising
<