ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పురాతన సమాధిని తవ్వుతుండగా అడుగున షాకింగ్ సీన్.. ఎవరూ ఊహించని విధంగా..

ABN, Publish Date - Mar 12 , 2024 | 06:09 PM

తవ్వకాల సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బంగారం కోసం తవ్వుతుండగా.. చిత్రవిచిత్ర ఆకారాలు బయటపడడం, బతికున్న తాబేళ్లు కనపడడం ఇటీవల చూశాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

తవ్వకాల సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బంగారం కోసం తవ్వుతుండగా.. చిత్రవిచిత్ర ఆకారాలు బయటపడడం, బతికున్న తాబేళ్లు కనపడడం ఇటీవల చూశాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. పురతాన సమాధిని తవ్వుతుండగా షాకింగ్ సీన్ కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా మట్టి కింద వింత వింత వస్తువులు బయటపడ్డాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

మధ్య అమెరికా (Central America) పరిధి పనమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనామాకు చెందిన పురావస్తు శాఖ అధికారులు (Archaeology Department) ఇటీవల చేపట్టిన తవ్వకాల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎల్ కానో ఆర్కియలాజికల్ పార్క్‌లో ఉన్న పనామాలో ఉన్నత వర్గానికి చెందిన ప్రభువు సమాధిని (ancient tomb) తవ్విగా వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. కొంత దూరం తవ్వగానే కొన్ని సిరామిక్ వస్తువులు బయటపడ్డాయి. మరికొంత తవ్వగా ఏకంగా బంగారు వస్తువులే (Gold items) కనిపించాయి. ఆ వస్తువులు క్రీ.శ. 750-800 మధ్య కోక్లే కేంద్ర ప్రావిన్సు ప్రాంతంలో జీవించిన వారివని తెలిసింది. ఈ వస్తువులు చాలా ధర పలకడంతో పాటూ ఎంతో చరిత్ర ఉందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

Viral Video: కొంపముంచిన హైనా.. జింకపై ప్రేమ కురిపించిన పులి.. చివరకు మనసు ఎలా మార్చుకుందంటే..

ఆ ప్రాంతంలో ఒకే చోట అనేక మృతదేహాలు ఖననం చేసినట్లు తెలుస్తోందన్నారు. అప్పటి కాలంలో ఉన్నత వర్గానికి చెందిన వారు చనిపోతే.. వారితో పాటూ వారి కోసం బలిదానం చేసిన వారిని కూడా ఖననం చేసేవారని చెప్పారు. సమాధిలో దొరికిన వస్తువుల్లో బంగారు దుస్తులతో పాటు అయిదు పెక్టోరల్స్, గోళాకారంలోని బంగారు పూసలతో కూడిన రెండు బెల్ట్‌లు, నాలుగు కంకణాలు, మానవుల ఆకారంలోని రెండు చెవిదుద్దులు, నెక్లెస్‌లు, పిల్లనగోవితో పాటు ఒక స్కర్టు ఉందని వివరించారు. తొమ్మిదో నంబర్ సమాధిలో ప్రస్తుతం తవ్వకాలు చేపడుతున్నామని, ఈ ప్రాంతంలో ఇంకా తవ్వాల్సి ఉందని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అంత శక్తివంతమైన ఏనుగు.. మనుషులు చేసే పనిని.. ఎంత సున్నితంగా చేస్తోందో చూస్తే..

Updated Date - Mar 12 , 2024 | 06:09 PM

Advertising
Advertising