Viral Video: పెళ్లి వేదికపై వరుడి అసహనం మామూలుగా లేదుగా.. అతడి ప్రవర్తన చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Mar 28 , 2024 | 06:11 PM
వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. వధువు తెలీకుండా వరుడు ప్రాంక్ ప్లాన్ చేయడం, స్నేహితులంతా కలిసి...
వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. వధువు తెలీకుండా వరుడు ప్రాంక్ ప్లాన్ చేయడం, స్నేహితులంతా కలిసి వధూవరులను సర్‌ప్రైజ్ చేయడం, కళ్యాణ మంటపంలోకి విచిత్రవాహనాల్లో ఎంట్రీ ఇవ్వడం.. ఇలా వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. పెళ్లి వేదికపై వరుడు ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించడం చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలో అతిథుల మధ్య వధూవరులు (bride and groom) పెళ్లి వేదిక పైకి చేరుకుంటారు. స్నేహితులంతా వధువును పైకి తీసుకెళ్తుండగా.. వరుడు కూడా ఆమె చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అతడి ప్రవర్తనలో తేడా వచ్చింది. వేదిక పైకి వెళ్లగానే ఒక్కసారిగా అతను ఒక్కడూ దూరంగా వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. తర్వాత దండలు (garlands) మార్చుకోవాలని బంధువులు సూచించడంతో దగ్గరికి వధువు దగ్గరికి వస్తాడు.
Viral Video: కారు డిక్కీలో లగేజీ తీసుకెళ్లడం చూశాం కానీ.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..
ఈ క్రమంలో ముందుగా వధువు తన చేతిలో దండను వరుడి మెడలో వేస్తుంది. అప్పటికే విచిత్రంగా చూపులు చూస్తున్న వరుడు.. వెంటనే కంగారుగా ఆమె మెడలో దండ వేస్తాడు. ఆ వెంటనే చేతులు పైకి పెట్టి గట్టిగా చప్పట్లు కొడతాడు. అంతటితో ఆగకుండా వెనక ఉన్న వారిని కౌగిలించుకుని పిచ్చ పట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు. వరుడి నిర్వాకానికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ వరుడేంటీ.. విచిత్రంగా ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వరుడిని ఎక్కడా చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Mar 28 , 2024 | 06:11 PM