Viral Video: ఆగలేకపోయిన వరుడు.. వధువు పక్కన ఉండగానే.. స్టేజీ కిందకు దూకేసి మరీ..
ABN, Publish Date - May 29 , 2024 | 03:32 PM
ప్రస్తుతం జరిగే వివాహ కార్యక్రమాలపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏదోటి చేసి నెటిజన్ల దృష్టిలో పడాలని చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యూస్, లైకుల కోసం ...
ప్రస్తుతం జరిగే వివాహ కార్యక్రమాలపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏదోటి చేసి నెటిజన్ల దృష్టిలో పడాలని చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యూస్, లైకుల కోసం వీళ్లు చేసే పనులు అందరికీ వినోదాన్ని అందిస్తున్నాయి. కొందరు వధూవరులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేదిక ఉండగా ఒక్కసారిగా వరుడికి పూనకం వచ్చింది. వధువు పక్కన ఉండగానే దండ విసిరికొట్టి, స్టేజి కిందకు దిగి మరీ అతను చేసిన నిర్వాకం అంతా నవ్వుకునేలా ఉంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులను (bride and groom) ఊరేగిస్తుంటారు. వాహనంపై ఏర్పాటు చేసిన సోఫాలో వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో కూర్చుని ఊరేగింపులో పాల్గొంటారు. ఈ క్రమంలో ఊరేగింపు మధ్యలో వరుడి స్నేహితులు డప్పు వాయిద్యానికి తీన్మార్ స్టెప్పులు వేస్తారు. స్నేహితుడు డాన్స్ (Groom Dance) వేయడం చూసి వరుడు ఆగలేకపోతాడు. తనకూ డాన్స్ వేయాలని ఉన్నా.. ఎవరేమన్నా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో అలాగే కూర్చుండిపోతాడు.
అయితే చివరకు అతను ఆగలేకపోతాడు. ‘‘ఎవరేమి అనుకున్నా పర్లేదు.. డాన్స్ వేసి తీరాల్సిందే’’.. అని అనుకుని తన మెడలోని దండను తీసి, సోఫాలో విసిరేస్తాడు. పరుగు పరుగున స్టేజీ దిగి వెళ్లి, తన స్నేహితుడితో కలిసి తానూ తీన్మార్ స్టెప్పులు వేస్తాడు. ఎంతో ఉత్సాహంతో డాన్స్ వేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తాడు. వరుడి డాన్స్ చూసి అతడి స్నేహితులు, బంధువులంతా చప్పట్లు కొడుతూ అత్ని ఎంకరేజ్ చేస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - May 29 , 2024 | 03:32 PM