మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: పొలాల్లోకి వెళ్లిన పెళ్లికొడుకు.. చివరకు అతిథులకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూస్తే..

ABN, Publish Date - May 06 , 2024 | 03:58 PM

ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటోంది. పెళ్లిలో జరిగే చిన్న చిన్న ఘటనలు కూడా ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వాటిలో కొన్ని నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral video: పొలాల్లోకి వెళ్లిన పెళ్లికొడుకు.. చివరకు అతిథులకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూస్తే..

పెళ్లికి సంబంధించిన వీడియోలుసోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లును తెగ ఆకట్టకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది వధూవరులు తమ వివాహ కార్యక్రమం వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెళ్లికొడుకు పెళ్లి సమయం దగ్గర పడుతున్న సమయంలో పొలాల్లోకి వెళ్లాడు. చివరకు అతడు ఇచ్చిన ఎంట్రీ చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే వరుడు మాత్రం పెళ్లి మంటపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. స్వతహాగా రైతు కావడంతో పెళ్లి మంటపంలోకి కూడా ఎద్దుల బండిపై వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి దుస్తులు ధరించిన వరుడు.. నేరుగా తమ పొలాల్లోకి వెళ్లాడు. అక్కడి నుంచి ఎద్దుల బండిపై కూర్చుని.. అటు నుంచి అటే కళ్యాణ మంటపానికి వెళ్లాడు.

Viral video: సమయంతో పాటూ విద్యుత్ బిల్లునూ సేవ్ చేశాడు.. ఇతడి ఇస్త్రీ ట్రిక్ మామూలుగా లేదుగా..


ఎద్దులను అందంగా అలంకించి, చిన్న చిన్న చక్రాలతో తయారు చేసిన (groom entered the wedding hall on bullock cart) బండి కూర్చుని దర్జాగా మంటపంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుడి విచిత్ర ఎంట్రీ చూసి బంధువులంతా అవాక్కయ్యారు. రైతు కొడుకు అనిపించుకున్నవంటూ... చాలా మంది అతన్ని ప్రశంసించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంట్రీ అదిరింది’’.. అంటూ కొందరు, ‘‘రైతు బిడ్డ అనిపించుకున్నావ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - May 06 , 2024 | 03:58 PM

Advertising
Advertising