ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పెళ్లి వేదికపై ఐ ఫోన్ అన్‌బాక్స్ చేసిన వరుడు.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:43 PM

పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వధూవరుల మధ్య ఏ చిన్న విచిత్ర ఘటన చోటు చేసుకున్నా.. క్షణాల్లో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా...

పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వధూవరుల మధ్య ఏ చిన్న విచిత్ర ఘటన చోటు చేసుకున్నా.. క్షణాల్లో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వరుడు పెళ్లి వేదికపై కొత్త ఫోన్‌ను అన్‌బాక్స్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి తమాషా సంఘటన (Funny incident) చోటు చేసుకుంటుంది. వధూవరులు వేదిక పైకి రాగానే.. వధువు కుటుంబ సభ్యులు.. అతడి చేతికి కొత్త ఐ ఫోన్ బాక్స్ ఇచ్చి ఓపెన్ చేయమని చెబుతారు. ఐ ఫోన్ బాక్స్ చూడగానే వరుడు కూడా ఎంతో సంతోషంతో దాన్ని అన్‌బాక్స్ చేస్తాడు. చివరకు బయటికి తీసి చూస్తే.. ఐ ఫోన్-14 (iPhone-14) ఉంటుంది. దీంతో వరుడికి చిర్రెత్తుకొస్తుంది. ‘‘నేను ఐ ఫోన్-15 (iPhone-15) అడిగితే.. మీరు ఐ ఫోన్-14 తీసుకొస్తారా’’.. అంటూ వారితో గొడవ పెట్టకుంటాడు.

Optical Illusion: ఈ అడవిలో దాక్కున్న గుర్రాన్ని.. 10 సెకన్లలో కనిపెడితే మీరే కింగ్..

ప్రస్తుతానికి ఈ ఫోన్‌తో సరిపెట్టుకోమంటూ వాళ్లు ఎంత సర్దిచెబుతున్నా అతను వినిపించుకోడు. చివరకు కొత్త ఫోన్ కుర్చీపై పడేసి, అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అతన్ని ఆపాలని ఎంత ప్రయత్నించినా వరుడు మాత్రం వినిపించుకోకుండా వెళ్లిపోతాడు. అయితే ఇదంతా వారు వినోదం కోసం చేసినా.. వారి నటన చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు నిజంగానే జరుగుతుంటాయి’’.. అంటూ కొందరు, ‘‘చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..

Updated Date - Apr 11 , 2024 | 08:47 PM

Advertising
Advertising