Viral Video: పెళ్లిలోనూ ఇదేం పనయ్యా బాబూ.. ఈ వరుడు ఫోన్‌లో చేస్తున్న నిర్వాకం చూస్తే.. అవాక్కవుతారు..
ABN, Publish Date - Nov 29 , 2024 | 09:08 AM
వివాహాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చాలా మంది పెళ్లిలో వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి మంటపంలో జరిగే అన్ని కార్యక్రమాలూ వినూత్నంగా ఉండేలా చూసుకుంటుంటారు. మరికొన్నిసార్లు వధూవరులు విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా..
వివాహాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చాలా మంది పెళ్లిలో వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి మంటపంలో జరిగే అన్ని కార్యక్రమాలూ వినూత్నంగా ఉండేలా చూసుకుంటుంటారు. మరికొన్నిసార్లు వధూవరులు విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో ఓ వరుడు ఏకాంతంగా కూర్చుని ఉండడం చూసి కొందరికి అనుమానం కలిగింది. చివరకు సమీపానికి వెళ్లి.. ఫోన్‌లో అతడు చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరుడు (groom) ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. పెళ్లి జరుగుతున్న సమయంలో వరుడు ఏకాంతంగా కూర్చు్న్నాడు. దీంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది. అతను ఏం చేస్తున్నాడో కనుక్కునేందుకు సైలంట్‌గా దగ్గరికి వెళ్లారు.
Viral Video: ముసుగుతో వచ్చిన మహిళ.. చివరకు డాన్స్‌తో ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..
తీరా సమీపానికి వెళ్లి చూడగా.. వరడు ఫోన్‌లో (Groom doing trading) షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తూ కనిపించాడు. ఓ వైపు పెళ్లి జరుగుతున్నా కూడా మరోవైపు వరుడు ట్రేడింగ్ చేయడం మాత్రం మానుకోలేదు. ట్రేడింగ్ పట్ల వరడికి ఉన్న ఆసక్తిని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
‘‘అతను సీరియస్‌గా ట్రేడింగ్ చేస్తున్నా.. అందరికీ నవ్వు తెప్పిస్తోంది’’.., ‘‘పెళ్లి ఖర్చులను రాబట్టేందుకు ట్రేడింగ్ చేస్తు్న్నాడు’’.., ‘‘అసలైన ట్రేడర్ అంటే ఇతనే’’.., ‘‘కేవలం ట్రేడర్స్ మాత్రమే ఇతడి బాధను అర్థం చేసుకోగలుగుతారు’’.., ‘‘ట్రేడింగ్‌లో నష్టపోతే పెళ్లి మొత్తం బాధాకరంగా మారుతుంది బ్రదర్’’.., అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 12.5 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 29 , 2024 | 09:08 AM