Viral Video: రోటీన్‌కు భిన్నంగా వరుడు.. వధువు దండ వేస్తున్న సమయంలో..
ABN, Publish Date - May 12 , 2024 | 12:19 PM
వివాహ వేడుకల్లో వధూవరులతో పాటూ స్నేహితులు, అతిథులు.. సరదా జోకులు, ఆట పాటలతో పాటూ పంతాలు, పంట్టింపులకూ పోతుంటారు. తలంబ్రాలు పోసుకునే సమయంలో వధూవరులు పోటీపడుతుంటారు. తమదే...
వివాహ వేడుకల్లో వధూవరులతో పాటూ స్నేహితులు, అతిథులు.. సరదా జోకులు, ఆట పాటలతో పాటూ పంతాలు, పంట్టింపులకూ పోతుంటారు. తలంబ్రాలు పోసుకునే సమయంలో వధూవరులు పోటీపడుతుంటారు. తమదే పైచేయి ఉండాలనే ఉద్దేశంతో ఒకరినిమంచి మరొకరు పోటీపడి మరీ తలంబ్రాలు పోసుకోవడం చూస్తుంటాం. అలాగే నీళ్లలో ఉంగరాలు తీయడం తదితర కార్యక్రమాల్లో పంతాలకు పోతుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వరుడు రోటీన్‌కు భిన్నంగా ప్రవర్తించాడు. వధువు దండ వేస్తున్న సమయంలో అతడి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వరుడు విచిత్రంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వరమాల వేడుక (Varamala celebration) సందర్భంగా వధూవరులు (bride and groom) ఇద్దరూ వేదికపై ఆశీనులయ్యారు. ముందుగా వధువు వంతు వచ్చింది. దీంతో పూల మాల తీసుకున్న వధువు.. వరుడి మెడలో వేసేందుకు ప్రయత్నించింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో వరుడు దండ వేసుకోకుండా వధువును ఇబ్బంది పెడతాడు. అయితే ఈ వరుడు మాత్రం రోటీన్‌కు భిన్నంగా వధువు ముందు మోకాళ్లపై నిల్చుని దండ వేయించుకుంటాడు.
Viral Video: స్కూటీపై వచ్చిన మహిళను చూసి హడలెత్తిన ఏనుగు.. సమీపానికి రాగానే అది చేసిన నిర్వాకం..
వధువు దండ వేసిన తర్వాత వరుడు దండ వేసే సమయంలోనూ వధువు అలాగే నేలపై కూర్చుంటుంది. దీంతో వరమాల కార్యక్రమం ఎలాంటి భేషజాలకు తావు లేకుండా సజావుగా సాగుతుంది. వధూవరుల వింత ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దంపతుల మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉండవు’’.. అంటూ కొందరు, ‘‘ఈ వరుడు చాలా వెరైటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: యువతి తాపత్రయం చూసి జాలిపడ్డ గుర్రం.. చివరికి ఎలాంటి సాయం చేసిందంటే..
Updated Date - May 12 , 2024 | 12:46 PM