మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: దండ వేస్తుండగా వధువు షాకింగ్ రియాక్షన్.. భయంతో వణికిపోయిన వరుడు.. చివరకు..

ABN, Publish Date - May 22 , 2024 | 03:16 PM

ప్రస్తుతం ఏ వివాహం జరిగినా అందులో ఏదో ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడం షరామామూలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వధూవరులు కూడా తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరైతే...

Viral Video: దండ వేస్తుండగా వధువు షాకింగ్ రియాక్షన్.. భయంతో వణికిపోయిన వరుడు.. చివరకు..

ప్రస్తుతం ఏ వివాహం జరిగినా అందులో ఏదో ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడం షరామామూలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వధూవరులు కూడా తమ వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరైతే సినిమా స్టైల్లో వింత వింతగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దండ వేస్తుండగా.. వధువు ఇచ్చిన రియాక్షన్‌కు వరుడు బిత్తరపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరమాల (Varamala) వేడుకలో సరదా సంఘటన చోటు చేసుకుంటుంది. వధువు సోఫాలో కూర్చుని ఉండగా.. వరుడు (groom) దండ వేసేందుకు సిద్ధమవుతాడు. తీరా దండ వేసే సమయంలో వధువు (bride) మొఖం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న వధువు.. ఒక్కసారిగా కళ్లు పెద్దవి చేసి, వెకిలి నవ్వులు నవ్వుతూ చంద్రముఖి తరహాలో బిగ్గరగా అరుస్తుంది. ఆ వెంటనే తలను అటూ ఇటూ గట్టిగా తిప్పుతుంది. దీంతో వరుడు ఒక్కసారిగా భయంతో పక్కకు పారిపోతాడు. వధువుకు కనపడకుండా సోఫా వెనుకకు వెళ్లి దాక్కుంటాడు.

Viral Video: ముసుగు ధరించి వెళ్తున్న మహిళను వెంబడించిన ఎద్దు.. చివరకు ట్విస్ట్ ఏంటో తెలిస్తే..


వధువు వింత రియాక్షన్‌కు అక్కడున్న వారంతా అవాక్కవుతారు. కొందరు వధువు వద్దకు వచ్చి తలో వైపు ఆమె చేతులు పట్టుకుని సముదాయించే ప్రయత్నం చేస్తారు. అయినా వధువు మాత్రం దయ్యం పట్టిన వారిలా వెంట్రుకలు విరబోసుకుని ఊగిపోతూ ఉంటుంది. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన బంధువులంతా నవ్వుకున్నారు. ఇదంతా సరదా కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మహానటిని మించిపోయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘స్కిట్ భలే ప్లాన్ చేశారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

Updated Date - May 22 , 2024 | 03:16 PM

Advertising
Advertising