ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసిన సింహాలు.. కాసేపట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాయి..

ABN, Publish Date - Jul 28 , 2024 | 08:34 PM

ఏనుగుల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారికి వాటికి తిక్కరేగితే పెద్ద పెద్ద వృక్షాలను సైతం అవలీలగా పెకలించేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు పంట పొలాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాంటిది..

ఏనుగుల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారికి వాటికి తిక్కరేగితే పెద్ద పెద్ద వృక్షాలను సైతం అవలీలగా పెకలించేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు పంట పొలాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాంటిది ఇక ఏనుగుల జోలికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే మనుషులు కానీ, జంతువులు గానీ వాటి జోలికి వెళ్లే సాయసం చేయవు. కొన్నిసార్లు కొన్ని జంతువులు వాటితో పెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలను కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకట నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్ల ఏనుగే కదా అని దాడి చేసిన సింహాల పరిస్థితి చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న సింహాలు.. జంతువును వేటాడేందుకు తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వాటికి ఓ పిల్ల ఏనుగు కనిపిస్తుంది. చుట్టూ పెద్ద ఏనుగులు లేకపోవడంతో ఎలాగైనా చంపి తినేయాలని ప్లాన్ చేస్తాయి. వెంటనే పిల్ల ఏనుగుపై దాడి (Lion attack on baby elephant) చేసి చంపే ప్రయత్నం చేస్తాయి.

Viral Video: ఎద్దు విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. మేడపై నుంచి ఒక్కసారిగా..


చివరకు ఓ సింహం పిల్ల ఏనుగును కింద పడేసి దాని మెడ పట్టుకుంటుంది. ఇలా దాన్ని చంపేసే సమయంలో దూరంగా ఉన్న ఏనుగుల మంద గమనిస్తుంది. వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తాయి. ఏనుగుల ఘీంకారం వినగానే సింహాల గుండె గుభేల్ అంటుంది. సమీపానికి వచ్చిన ఏనుగులు సింహాలను తొక్కి చంపేసే ప్రయత్నం చేస్తాయి. వాటిని చూడగానే సింహాలన్నీ తోక ముడిచి అక్కడి నుంచి పారిపోతాయి.

Viral Video: యువకుడి వేలు పట్టుకున్న ఉడుత.. ఏంటా అని ఆశ్చర్యపోయేలోపే.. చివరకు అది చేసిన నిర్వాకం..


ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుల పవర్ అంటే ఇలా ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పిల్లల డాన్స్‌కు ఫిదా అయిన పావురం.. చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Jul 28 , 2024 | 08:34 PM

Advertising
Advertising
<