Viral: వామ్మో.. పాక్‌లో భారతీయ మహిళ ఫుడ్ స్టాల్.. మరీ ఇంత పాప్యులరా!
ABN, Publish Date - May 11 , 2024 | 07:17 PM
దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు. పాక్‌కు చెందిన ఓ యువకుడు దీని గురించి వీడియో చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
కరాచీ నగరంలో కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ స్టాల్ ఉంది. దీని పేరు కవితా దీదీ కా ఇండియన్ ఖానా. కవిత అనే మహిళ, ఆమె కుటుంబసభ్యులు ఈ స్టాల్ కలిసి నిర్వహిస్తుంటారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ వంటకాలన్నీ లభిస్తాయి. ముఖ్యంగా భారతీయ వంటకాలైన పావ్‌భాజీ, వడాపావ్, దాల్ సమోసా వంటివి జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కరామత్ అనే యూట్యూబర్ కవిత ఫుడ్ స్టాల్ గురించి వీడియో రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో, ఇది విపరీతంగా వైరల్ అవుతోంది (Hindu familys food stall in Karachi gets loads of love).
Viral: విమానం ఇంటిపై నుంచి వెళుతుండగా చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం! వెళ్లి చూస్తే..
ఈ వీడియోలో కరామత్.. కవిత ఫుడ్ స్టాల్ గురించి స్థానికులను పలకరించారు. అనేక మంది ఈ ఫుడ్ స్టా్ల్‌లో ఆహారం భలే రుచిగా ఉంటుందని చెప్పారు. భారతీయ వంటకాలు అద్భుతంగా ఉంటాయని అనేక మంది అన్నారు. తరచూ వచ్చి ఇక్కడే తింటుంటామని మరికొందరు చెప్పారు. పాక్‌లో ఇంతగా ఓ భారతీయ ఫుడ్ స్టాల్ పాప్యులర్ కావడంపై ఇక్కడి వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 11 , 2024 | 07:27 PM