మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: యువతి తాపత్రయం చూసి జాలిపడ్డ గుర్రం.. చివరికి ఎలాంటి సాయం చేసిందంటే..

ABN, Publish Date - May 12 , 2024 | 08:21 AM

మనుషులతో కొన్ని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం చూస్తుంటాం. ప్రధానంగా కుక్కలు, పిల్లులు, కోతులు, ఏనుగులు, గుర్రాలు.. మనుషులు చెప్పినట్లు చేస్తుంటాయి. అలాగే మనుషుల బాధను కూడా అర్థం చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో...

Viral Video: యువతి తాపత్రయం చూసి జాలిపడ్డ గుర్రం.. చివరికి ఎలాంటి సాయం చేసిందంటే..

మనుషులతో కొన్ని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం చూస్తుంటాం. ప్రధానంగా కుక్కలు, పిల్లులు, కోతులు, ఏనుగులు, గుర్రాలు.. మనుషులు చెప్పినట్లు చేస్తుంటాయి. అలాగే మనుషుల బాధను కూడా అర్థం చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తాపత్రయాన్ని అర్థం చేసుకున్న గుర్రం.. చివరకు ఆమెకు సాయం చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) గుర్రపు స్వారీ చేయాలని అనుకుంటుంది. ఇందుకోసం ఓ పెద్ద గుర్రం కూడా సిద్ధంగా ఉంటుంది. గుర్రం పైకి ఎక్కి సవారీ (horse riding) చేయడమే ఆలస్యం.. అనుకున్న తరుణంలో యువతి అందుకు సిద్ధమవుతుంది. అయితే గుర్రం వద్దకు రాగానే ఆమెకు పెద్ద పరీక్ష ఎదురవుతుంది. గుర్రం పైకి ఎక్కడం సాధ్యం కాదు.

Viral Video: దయ్యాలను కూడా భయపెడుతున్న రైతు.. పొలంలో ఎలాంటి ఏర్పాట్లు చేశాడంటే..


ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె గుర్రాని ఎక్కలేకపోతుంది. అయినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని గమనింనించిన గుర్రం.. ఆమె తాపత్రయాన్ని అర్థం చేసుకుంటుంది. ఉన్న చోటు నుంచి కొన్ని అడుగులు ముందుకు వెళ్లి నేలపై పడుకుంటుంది. ‘‘ఇప్పుడు వచ్చి నాపై కూర్చో’’.. అన్నట్లుగా యువతికి హింట్ ఇస్తుంది. పడుకున్న గుర్రంపై సదరు యువతి సులభంగా కూర్చుంటుంది. అలా కూర్చోగానే గుర్రం పైకి లేచి.. సవారీకి రెడీ అయిపోతుంది.

Viral Video: మేకతో సెల్ఫీ దిగిన యువతి.. చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు గుర్రం మంచితనం చూసి తెగ మెచ్చకుంటున్నారు. ‘‘ఈ గుర్రం ఎంతో దయగలది’’.. అంటూ కొందరు, ‘‘యువతి బాధను అర్థం చేసుకున్న గుర్రం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 12 , 2024 | 08:21 AM

Advertising
Advertising