Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..
ABN, Publish Date - Aug 06 , 2024 | 09:28 AM
భార్యాభార్తల మధ్య చోటు చేసుకునే ఘటనలు కొన్నిసార్లు అయ్యో పాపం అనేలా చేస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. నిత్యం గొడవలు పడే భార్యాభర్తలే కాదు.. ఎప్పుడూ నవ్వుతూ ..
భార్యాభార్తల మధ్య చోటు చేసుకునే ఘటనలు కొన్నిసార్లు అయ్యో పాపం అనేలా చేస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. నిత్యం గొడవలు పడే భార్యాభర్తలే కాదు.. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే దంపతులు కూడా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా, ఓ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వంటింట్లో తన భర్త అవాక్కయ్యేలా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సొంతం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో (Funny Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) వంటింట్లో కాఫీ చేసేందుకు సిద్ధం చేస్తుంటుంది. ఇందుకోసం పాల ప్యాకెట్ ఓపెన్ చేసి పాలన్నింటినీ పాత్రలో పోస్తుంది. అదే సమయంలో ఆమె భర్త కూడా అక్కడే నిలబడి ఉంటాడు. ప్యాకెట్‌లోని (empty milk packet) పాలను పాత్రలో పోసిన తర్వాత.. ఖాళీ ప్యాకెట్‌ను గోడకు తగిలించమని భర్తకు చెబుతుంది.
Viral: పట్టుకునే క్రమంలో కాటేసింది.. చికిత్స తీసుకుని వచ్చి కోబ్రాను చూడగా.. షాకింగ్ సీన్..
భార్య చెప్పగానే అతను ఆ పాల ప్యాకెట్ తీసుకుని, గోడకు ఎలా తగిలించాలబ్బా.. అని కాసేపు ఆలోచిస్తాడు. తర్వాత అక్కడే ఉన్న ఓ బాక్సు తీసుకొచ్చి, అందులో కత్తెర, టేపును బయటికి తీస్తాడు. టేపును కత్తిరించేందుకు సిద్ధమవుతుంటాడు. ఇదంతా గమనిస్తున్న భార్య.. ‘‘ఏం చేస్తు్న్నావ్’’.. అని అడుగుతుంది. అందుకు అతను.. ‘‘నువ్వేగా ప్యాకెట్‌ను గోడకు తగిలించమన్నావ్.. అందుకే టేప్ కట్ చేస్తున్నా’’.. అని అంటాడు. దీనికి భార్యకు చిరాకు వచ్చి.. ‘‘నీకు పని చెప్పడం నా తప్పైంది’’.. అని అనుకుంటూ ఖాళీ ప్యాకెట్‌ను ఇలా చేతిలోకి తీసుకుని, అలా గోడకు అంటిచేస్తుంది.
Viral Video: వయసు మూడేళ్లే అయినా.. ఇతడు చేసిన పని చూస్తే.. అభినందించకుండా ఉండలేరు..
ఆమె ప్యాకెట్‌ను గోడకు అంటించగానే.. (woman stick milk packet to wall) ఎలాంటి టేప్ సాయం లేకుండానే అలాగే అతుక్కుపోతుంది. దీన్ని చూసిన ఆమె భర్త అవాక్కవుతాడు. తన భార్య టాలెంట్ చూసి మురిసిపోతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భర్త నోరు మూయించే కళ ఈమెకు బాగా వచ్చినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ గోడ అయస్కాంతంలా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: చూస్తుండగానే మాయమైన రోడ్డు.. దడ పుట్టిస్తున్న 52 సెకన్ల వీడియో..
Updated Date - Aug 06 , 2024 | 09:28 AM