Viral Video: రోడ్డుపై దూసుకెళ్తున్న పూరి గుడిసె.. ఇతడి టెక్నాలజీ మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Apr 04 , 2024 | 06:33 PM
కొందరు చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు పాత వాహనాలను వినూత్న రీతిలో కొత్తగా మార్చి అందరి ప్రశంసలను అందుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను మరింత విచిత్రంగా మారుస్తుంటారు. ఇలాంటి...
కొందరు చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు పాత వాహనాలను వినూత్న రీతిలో కొత్తగా మార్చి అందరి ప్రశంసలను అందుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను మరింత విచిత్రంగా మారుస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పూరి గుడిసెను వాహనంలా మార్చాడు. రోడ్డుపై పూరి గుడిసె దూసుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ (Gujarat) సూరత్‌కు చెందిన క్రియేటివ్ సైన్స్ బృందం సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. ముందుగా పూరి గుడిసెను ఏర్పాటు చేసి, దానికి నాలుగు వైపులా ఉన్న కిటికీలకు అద్దాలు ఏర్పాటు చేశారు. తర్వాత దానికి నాలుగు చక్రాలు, మోటారును బిగించడంతో చివరకు పూరి గుడిసె వాహనం (hut vehicle) సిద్ధమైంది. ఫైనల్‌గా పూరి గుడిసె రోడ్డుపై దూసుకెళ్లడం చూసి వాహనదారులంతా అవాక్కయ్యారు. ఇందేంటీ, మరీ విచిత్రంగా ఉందే అనుకుంటూ దాన్ని ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరుగుతుంది..
గుడిసెలో ఉన్న వ్యక్తి.. కిటికీ నుంచి రోడ్డును గమనిస్తూ వాహనాన్ని నడుపుతున్నాడు. బ్యాటరీతో నడిచే ఈ వాహనం గంటకు 15 నుంచి 20 వరకూ మైలేజీ ఇస్తున్నట్లు సదరు తయారీదారులు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ వాహనం చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వేసవికాలంలో ఇది బాగా పనికొస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.60లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: రంగు రంగు స్టిక్కర్లతో మ్యాజిక్ చేసిన యువతి.. స్కూటీని చివరకు ఎలా మార్చేసిందో చూడండి..
Updated Date - Apr 04 , 2024 | 06:33 PM