ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మరమరాల పందిరిలో... రాములోరి కల్యాణం

ABN, Publish Date - Apr 16 , 2024 | 10:50 AM

సైదాబాద్‌, ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయంలో మరమరాలు... వేరుసెనగలతో తీర్చిదిద్దిన పందిరిలో 39 సంవత్సరాలుగా సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కల్యాణంతో ముగుస్తాయి.

- 39 ఏళ్లుగా ధర్మనిలయంలో ఉత్సవాలు

హైదరాబాద్: సైదాబాద్‌, ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయంలో మరమరాలు... వేరుసెనగలతో తీర్చిదిద్దిన పందిరిలో 39 సంవత్సరాలుగా సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కల్యాణంతో ముగుస్తాయి. రామాయణ ఇతిహాసం తెలియజేసే విధంగా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఉత్సవాల్లో జరిగే నిత్యాన్నదానంలో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు.

39 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) సమీప గ్రామం నుంచి వచ్చిన సూర్యనారాయణరాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటుచేశారు. 39 ఏళ్లుగా ఆలయంలో మరమరాలతో పందిరి వేసి కల్యాణం నిర్వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సూర్యనారాయణ రాజు మృతి చెందగా ఆయన సతీమణి కుటుంబసభ్యులతో కలిసి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో భాగంగా రామకోటి జపం, విష్ణుసహస్ర నామాలు, నగర సంకీర్తన, భజనలు, హోమాలు, నిత్యాన్నదానం ఉంటాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: అయ్యోదేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

2 బస్తాల మరమరాలు, వేరుశెనగలు...

మాఘ శుద్ధ పంచమి రోజున గ్రామదేవతకు చలిమిడి, పాలతో అభిషేకించి పందిరి పనులకు శ్రీకారం చుడతారు. మరమరాల ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజున ప్రారంభిస్తారు. సుమారు 40 మంది మహిళలు రోజూ దారాలకు మరమరాలు ఎక్కిస్తారు. 60కిలోల మరమరాలు, 40 కిలోల వేరుశెనగలను అలంకరణకు వినియోగిస్తారు. రామనామ జపం చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక వాతావరణంలో అల్లికలను సాగిస్తారు.

ఇదికూడా చదండి: TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు

మరా...మరా... రామ.

రామ జపానికి మూలం మర అనే భావనతో సీతారాముల కల్యాణానికి మరమరాలు ఏర్పాటుచేశారు. పదకొండు మరమరాల చొప్పున తయారు చేసే దండలో ఓ పల్లీగింజ (వేరుశెనగ) చేరుస్తారు. సీతాదేవి భూగర్భంలో అవతరించిందనే పౌరాణిక గాథను అనుసరించి భూమి నుంచి వచ్చే వేరుశెనగకు మరమరాల దండల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దశేంద్రియాల తర్వాత ఏకాదవ ఇంద్రియానికి ప్రత్యేక స్థానం కల్పించే ఉద్దేశంతోనే పదకొండు సంఖ్యను ఎన్నుకున్నారు.

రాముడి ఆదేశంతోనే సేవ...

చిన్నప్పటి నుంచి రాముడి భక్తురాలిని. రాముడి ఆదేశంతో మేమంతా 39 ఏళ్లుగా మరమరాల పందిరిలో నిరాటంకంగా శ్రీరామ కల్యాణం జరిపిస్తున్నాం. మరమరాల ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజున మొదలు పెడతాం. 40 మంది భక్తులు మరమరాల హారాలు అల్లుతారు. ఇద్దరు కుమారులు, కోడళ్ల సహకారంతో యజ్ఞం నిరాటంకంగా కొనసాగిస్తున్నా. నా తదనంతరం కుటుంబసభ్యులు సంప్రదాయాన్ని కొనసాగిస్తారని నమ్ముతున్నా

- నిర్వాహకురాలు అనసూయమ్మ

ఇదికూడా చదవండి: Sriramanavami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..

Updated Date - Apr 16 , 2024 | 01:48 PM

Advertising
Advertising