Viral: ఆ ఏనుగు పూర్తిగా కోలుకోవడంతో ఐఎఫ్ఎస్ అధికారి సంబరం!
ABN, Publish Date - Mar 24 , 2024 | 04:40 PM
ఇబ్బందులు పాలైన ఓ అడవి ఏనుగు ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మానవ కార్యకలాపాల కారణంగా అనేక జీవజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అటవీ శాఖ అధికారుల శ్రమ వల్ల ఓ ఏనుగు పూర్తిగా కోలుకుంది (Tusker Fully Recovered). దీంతో, తమ శ్రమ ఫలించినందుకు అధికారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ శుభవార్తను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద నెట్టింట షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా (Viral Video) మారాయి.
Break A Lock: వామ్మో..ఇదేం మ్యాజిక్ రా బాబూ.. తాళంపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తే..
ఇబ్బందుల పాలైన ఓ మగ ఏనుగుకు అధికారులు చికిత్స చేశారు. ఆ తరువాత ఏనుగుకు రేడియో కాలర్ తగిలించి (Radio Collared), దాని బాగోగులు గమనించ సాగారు. రేడియో కాలర్ ప్రసరించే సిగ్నల్స్ ద్వారా అతి ఎక్కడున్నదీ తెలుసుకుంటూ ఏనుగు ఆరోగ్యంపై శ్రద్ధం పెట్టారు. ఇటీవల కాలంలో పూర్తిగా కోలుకున్న ఏనుగు ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతుండటంతో అధికారుల్లో ఆందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఏనుగు కోలుకునేందుకు ఎంతగానో శ్రమించిన అటవీ శాఖ అధికారులకు సుశాంత నంద ధన్యవాదాలు తెలిపారు.
Diesel Bikes: ప్రపంచంలో డీజిల్ బైకులు ఎందుకు లేవో తెలుసా?
‘‘రేడియో కాలర్ ఉన్న ఏనుగు పూర్తిగా కోలుకుంది. ఇది ఎంతో సంతోషకరం. ప్రస్తుతం అది అడవిలో సాధారణ జీవితం గడుపుతోంది. రేడియో కాలర్ ద్వారా దాని కదలికల సమాచారం నిరంతరం అందుతోంది. యావత్ బృందం కృషి కారణంగా ఓ టస్కర్‌ను కాపాడుకోగలిగాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, ఏనుగుల సంరక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వం, వాటి కదలికలపై ఓ కన్నేసి ఉంచేందుకు రేడియో కాలర్స్ కూడా వినియోగించడం ప్రారంభించింది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 24 , 2024 | 04:45 PM