ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: రామాయణం నాటకాన్ని కించపరిచారు.. ఐఐటీ విద్యార్థులకు లక్షల రూపాయల ఫైన్!

ABN, Publish Date - Jun 20 , 2024 | 12:40 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి(Bombay) లో ఇటివల నిర్వహించిన రామాయణం(Ramayanam) నాటకాన్ని కించపరిచారని పలువురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు లక్షల రూపాయల ఫైన్ విధించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

IIT Bombay Fined Rs 1.2 Lakh On Each Students

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి(Bombay) లో ఇటివల నిర్వహించిన రామాయణం(Ramayanam) నాటకాన్ని కించపరిచారని పలువురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో నలుగురు విద్యార్థులకు రూ. 1.20 లక్షల జరిమానా విధించగా..మరో నలుగురు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.40,000 జరిమానా విధించి హాస్టల్‌ ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే వెలుగులోకి వచ్చిన నోటీసు(notice)లో మాత్రం ఒక్క విద్యార్థికి మాత్రమే రూ. 1.20 లక్షల ఫైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎనిమిది మంది విద్యార్థులపై కూడా చర్యలు తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.


మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ఐఐటీ బాంబే(IIT Bombay)లో మార్చి 31న కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో రామాయణం ఆధారంగా 'రాహోవన్' నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో స్త్రీవాద సమస్యల పేరుతో రాముడి పాత్రను తారుమారు చేసి పాత్రల పేర్లలో మార్పులు చేశారు. వేదికపై దేవుడిని ఎగతాళి చేస్తూ డైలాగ్స్ పలికారు. దీంతో ఈ నాటకాన్ని ఓ వర్గం విద్యార్థులు వ్యతిరేకించారు. ఇది హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉందని ఆరోపించారు. రాముడు, సీత క్యారెక్టర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.


దీంతో ఐఐటీ సిబ్బంది స్పందించి ఈ నాటకంలో పాల్గొన్న ఓ విద్యార్థులు(student) జరిమానా చెల్లించాలంటూ జూన్ 4న నోటీసు ఇచ్చింది. 1.20 లక్షల జరిమానాను జులై 30, 2024న డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అంతకుముందు ఈ డ్రామాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మే 8న క్రమశిక్షణా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో విద్యార్థులు కూడా సమావేశంలో పాల్గొనగా, చర్చ తర్వాత శిక్షను నిర్ణయించారు.

అంతేకాదు శిక్షను ఉల్లంఘిస్తే మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని కూడా ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నోటీసు సోషల్ మీడియా(socail media)లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఓ విద్యార్థికి ఒక సెమిస్టర్‌ ఫీజుతో సమానమైన జరిమానా విధించడం పట్ల విమర్శిస్తుండగా, మరికొంత మంది మాత్రం అలా దేవుడి పాత్రలను కించపరచడం సరికాదని అంటున్నారు. ఆ వీడియో ఎలా ఉంది, నోటీసులో ఏం ఉందో ట్వీట్ల ద్వారా తెలుసుకోవచ్చు.


ఇది కూడా చదవండి:

Viral Video: పేరుకు కేంద్ర మంత్రి.. కానీ స్కీమ్ పేరు రాయడంలో తప్పులు, తప్పులు

India vs Afghanistan: నేడు ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే


Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 12:44 PM

Advertising
Advertising