ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: అన్మోలా మజాకా.. దీని మెనూ చూస్తే కళ్లు తేలేయాల్సిందే

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:34 PM

హర్యానాకు చెందిన ఏనిమిదేళ్ల గేదె.. అన్మోల్ ప్రత్యేకతను సంతరించుకుంది. జస్ట్ 15 వందల కేజీలున్న.. ఈ గేదె మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. దీని ఖరీదు రూ. 23 కోట్లు ఉంది. అన్మోల్‌ను ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేసేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. ఇక రోజు వారి మెనూని చూస్తే..

పాలిచ్చే గేదె ధర ఎంత ఉంటుంది. రూ. 2 లేదా రూ.5 లక్షలు ఉంటుంది. మహా అయితే రూ.10 లక్షల వరకు ఉంటుంది. కానీ ఓ గేదె ధర మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. అది కూడా ఒకటి రెండు కోట్లు కాదు.. జస్ట్ రూ. 23 కోట్లు. అంతే. హర్యానాకు చెందిన ఈ గేదె పేరు అన్మోల్. దేశంలో ఎక్కడ పుష్కర మేళ జరిగినా.. ఎక్కడ వ్యవసాయ ప్రదర్శన జరిగినా.. అక్కడ ఈ అన్మోల్‌ను ఆ ప్రదర్శనలో యజమాని గిల్ ఉంచుతున్నారు. దీంతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అఖిల భారత రైతు ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్మోల్‌ను ప్రదర్శనకు ఉంచారు.ఈ ఉత్సవాలకు విచ్చేసిన వారికి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం ఏనిమిదేళ్ల వయస్సున్న ఈ గేదె 15 వందల కేజీల బరువు కలిగి ఉంది. ఇక ఈ గేదెకు ఆహారంగా పెట్టే మెను చూస్తే.. సామాన్యులకు సైతం కళ్లు చెదరాల్సిందే.


ఒక రోజుకు.. 20 కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్,30 అరటిపళ్లు, 4 కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 కోడిగుడ్లును అన్మోల్‌కు ఆహారంగా యజమాని గిల్ అందిస్తున్నారు. అలాగే ఆయిల్ కేక్, పచ్చిమేత, నెయ్యి, సోయాబీన్స్‌తోపాటు మొక్కజొన్నలను సైతం ఆహారంగా ఇస్తున్నారు. అందుకోసం గిల్ ఒక రోజుకు రూ.1500 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ గేదె పరిమాణం, వంశపారంపర్యతతోపాటు సంతానోత్పత్తికి సంబంధించిన అంశాలు సంచలనంగా మారడంతో.. సోషల్ మీడియాలో సైతం అన్మోల్ ప్రత్యేకతలు వైరల్‌గా మారింది.


ఇక అన్మోల్‌ సంరక్షణకు గిల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోజుకు ఉదయం, సాయంత్రం.. రెండు సార్లు స్నానం చేయిస్తారు. బాదం, ఆవ నూనె ప్రత్యేక మిశ్రమంతో మసాజ్ చేస్తారు. అలాగే రోజు వారీగా అన్మోల్‌ను వస్త్రధారణ చేసి అలంకరిస్తారు. దీనిని బట్టి అన్మోల్‌ను సంరక్షించడంలో యజమాని ఎన్ని చర్యలు తీసుకోవాలో.. అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. అయితే గతంలో అన్మోల్ తల్లి రోజుకు 25 లీటర్ల పాలు ఉత్పత్తి చేసేది. అయితే అన్మోల్ తల్లిని దాని సోదరిని సైతం భారీ ధరకు విక్రయించారు.


పరిమాణంతోపాటు ఆహారంలో అన్మోల్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక దీని వీర్యానికి భారీగా డిమాండ్ ఉంది. పశువుల పెంపకం దారులు అందుకోసం భారీగా క్యూ కడుతున్నారు. వారంలో రెండు సార్లు మాత్రం అన్మోల్ వీరాన్ని సేకరిస్తారు. దానిని వందల కొద్ది పశువుల పెంపకం కోసం ఉపయోగింవచ్చు.


ఇక ఈ అన్మోల్ వీర్యం విక్రయాల ద్వారా ఒక మాసంలో రూ. 4 నుంచి 5 లక్షల వరకు గిల్‌కు లభిస్తుంది. అది గేదె నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తాడు. మరోవైపు రూ. 23 కోట్ల విలువైన ఈ అన్మోల్‌ను ఇంకా అధిక ధరకు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇప్పటికే క్యూ కడుతున్నారు. కానీ దీనిని విక్రయించేందుకు దాని యజమాని గిల్ మాత్రం సిద్దంగా లేరు.

For pratyekam And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 03:39 PM