ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IRTC: భారతీయ రైల్వే అదిరిపోయే ఆఫర్.. టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్‌పై భారీ తగ్గింపు..

ABN, Publish Date - Sep 30 , 2024 | 06:31 PM

రైలు టికెట్లపై పెద్దగా ఆఫర్లు ఉండవు. ఏదైనా పండుగల సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్రల కోసం ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. రోజువారీ రైళ్ల ప్రయాణానికి సంబంధించి భారతీయ రైల్వే నిర్ణయించిన టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. కానీ భారతీయ రైల్వే రోజువారీ రైళ్లలో టికెట్లపై అదిరిపోయే రాయితీ..

Train Tickets

బస్సు, విమాన టికెట్లపై ఆఫర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ రైలు టికెట్లపై ఆఫర్లు ఉంటాయని మీకు తెలుసా.. బస్సు, విమాన సర్వీసులను ప్రయివేట్ ఆపరేటర్స్ నడిపిస్తుంటారు. దీంతో పోటీ ప్రపంచంలో ఒక్కో సంస్థ ఒక్కో రకమైన ఆఫర్లను ప్రకటిస్తుంది. ముఖ్యంగా టికెట్ ధరలపై డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. అదే రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో రైలు టికెట్లపై పెద్దగా ఆఫర్లు ఉండవు. ఏదైనా పండుగల సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక యాత్రల కోసం ఆఫర్లను ప్రకటిస్తుంటుంది. రోజువారీ రైళ్ల ప్రయాణానికి సంబంధించి భారతీయ రైల్వే నిర్ణయించిన టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. కానీ భారతీయ రైల్వే రోజువారీ రైళ్లలో టికెట్లపై అదిరిపోయే రాయితీ ఇస్తుంది. రిజర్వేషన్ టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏదైనా రైలులో చార్ట్ తయారీ సమయానికి రిజర్వేషన్ కోచ్‌లలో టికెట్లు మిగిలిపోతే వాటిని సేల్ చేయడం కోసం రిజర్వేషన్ టికెట్లపై రాయితీని ప్రకటిస్తు్ంది. రైలు చార్ట్ తయారైన తర్వాత నుంచి స్టేషన్ నుంచి రైలు బయలుదేరడానికి 30 నుంచి 60 నిమిషాల ముందు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈలోపు టికెట్లు అయిపోతే ఆఫర్ వర్తించదు. స్లీపర్, ఏసీ కోచ్ టికెట్లపై రాయితీ వర్తిస్తుంది. ఐఆర్‌సీటీసీ యాప్, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే టికెట్లపై తగ్గింపు వర్తిస్తుంది.

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్


10 శాతం తగ్గింపు..

భారతీయ రైల్వే కరెంట్ అవైలబిలిటీ టికెట్లపై పది శాతం రాయితీ అందిస్తుంది. ఇది రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు మాత్రమే వర్తిస్తుంది. ఏదైనా రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు ఫస్ట్ చార్ట్‌ తయారవుతుంది. చార్ట్ తయారైన తర్వాత రైలులో బెర్తులు ఖాళీగా ఉంటే వాటిని కరెంట్ అవైలబిలిటీ కోటాలో విడుదల చేస్తారు. ఈ టికెట్లను రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లపై పది శాతం రాయితీ వస్తుంది. గతంలో కేవలం ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే కరెంట్ అవైలబిలిటీ టికెట్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీతో పాటు ఆన్‌లైన్‌లోనూ కరెంట్ అవెలబిలిటీ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ టికెట్ ధర రూ.500 అయితే.. అదే టికెట్ కరెంట్ అవెలబిలిటీలో రూ.450కు లభిస్తుంది. రిజర్వేషన్ ఛార్జీల్లో ఎటువంటి తేడా ఉండదు. కేవలం టికెట్ ధరలో మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్


అన్ని రైళ్లల్లో..

భారతీయ రైల్వే అన్ని ప్రయాణీకుల రైళ్లలో ఈ రాయితీని అందిస్తోంది. స్లీపర్, ఏసీ క్లాస్‌ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. కరెంట్ అవైలబిలిటీ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉండదు. ప్రయాణానికి గంట నుంచి రెండు గంటల ముందు మాత్రమే బుక్ చేసుకునే టికెట్ కావడంతో.. తప్పనిసరిగా ప్రయాణించానుకునే వారు మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెంట్ అవైలబిలిటీ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల రైలును రైల్వే అధికారులు రద్దు చేస్తే మాత్రం టికెట్ ధరను తిరిగి చెల్లిస్తారు.


Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 30 , 2024 | 06:31 PM