ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు రూ.27 లక్షల బ్యాగు కొనుగోలు

ABN, Publish Date - Dec 29 , 2024 | 08:08 AM

లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు కూతురికి ఏకంగా రూ.27 లక్షల మినీ బ్యాగు కొనిచ్చిన ఓ తల్లి వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఇంతడబ్బు వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ జనాలు నోరెళ్లబెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్న కాలం ఇది. పేదలు మరింత కష్టాల్లో కూరుకుపోతుంటే ధనికుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న రోజులివి. మరోవైపు, జీవనవ్యయాలు తట్టుకోలేక మధ్యతరగతి వర్గం కునారిల్లుతోంది. ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లి సందర్భంగా ఆమె తల్లి ఇచ్చిన బహుమతి ప్రస్తుతం సంచలనంగా మారింది. ధనవంతుల అలవాట్లు, విచ్చలివిడిగా డబ్బు ఖర్చు వంటి అంశాలపై చర్చకు దారితీసింది (Viral).

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, తల్లీకూతుళ్లు ఇద్దరు ఓ లగ్జరీ స్టోర్‌కు వెళ్లారు. షాపు సిబ్బందికి తను ఎందుకొచ్చిందీ మహిళ వివరించింది. ‘‘హాయ్.. మేము ముంబైలో ఉంటాము. నా కూతురికి డిసెంబర్‌లో పెళ్లి. కాబట్టి ఆమెకు బర్కిన్ బ్యాగు కొనిద్దామని అనుకుంటున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చింది. మహిళ కూతురు మాత్రం తనకు మినీ కెల్లీ బ్యాగు కావాలని చెప్పుకొచ్చింది.

Viral: స్విగ్గీలో రూ.8,32,032లతో ఆర్డర్ పెట్టి సరికొత్త రికార్డు! ఇతడేం కొన్నాడో తెలిస్తే..


అయితే, పెద్ద హ్యాండ్ బ్యాగు తీసుకోమని మహిళ తన కూతురికి సలహా ఇచ్చింది. కానీ కూతురు మాత్రం చిన్న బ్యాగు వైపే మొగ్గు చూపుతుంది. తనకు ఆ బ్యాగును లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు మినహా మరెందుకూ వాడనని స్పష్టం చేసింది. అయితే, తనకు స్టైలీష్ లుక్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ మాత్రమే కావాలని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో షాపులోని సిబ్బంది వారికి ముందు రకరకాల బ్యాగులు చూపిస్తారు. పలాడియం, బంగారం హార్డ్‌వేర్‌తో టాన్, తెలుపు, నలుపు, నీలం రంగుల్లో ఉన్న హ్యాండ్‌బ్యాగులను వారికి చూపిస్తారు. తల్లీ ట్యాన్ రంగు బ్యాగు ఉపయుక్తంగా ఉంటుందని సూచిస్తుంది. కూతురు మాత్రం ప్రశాంతనిచ్చేలా ఉన్న తెలుపు రంగు బ్యాగు వైపే మొగ్గు చూపుతుంది. దీంతో, తల్లి తన కూతురికి ఆమెకు నచ్చిన తెలుపు మినీ కెల్లీని ఏకంగా 26 వేల పౌండ్లు (రూ.27 లక్షలు) పెట్టి కొనుగోలు చేస్తుంది. లవ్ లగ్జరీ అనే ఇన్స్‌స్టా అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేశారు. లిప్‌స్టిక్ పెట్టుకునే బ్యాగు కోసం మీరింత ఖర్చు పెడతారా అన్న ప్రశ్న క్యాప్షన్‌గా ఈ వీడియోను షేర్ చేశారు.

Viral: వధువుకు షాక్! రొట్టెలు లేటుగా వడ్డించారని మరో యువతిని పెళ్లాడిన వరుడు!


ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ సుమారు 20 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. కామెంట్ సెక్షన్లో జనాలు వివిధ రకాల వ్యాఖ్యలు, సందేహాలతో హోరెత్తించారు. ‘‘ఎవరు వీళ్లు. వీళ్లకు ఇంతడబ్బెలా వచ్చింది. ఒక చిన్న హ్యాండ్‌బ్యాగు కోసం ఏకంగా 27 లక్షలు ఖర్చు చేయడం నమ్మశక్యంగా లేదు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘ఇది నిజంగా మూర్ఖత్వమే. వారి వద్ద మరీ ఇంత డబ్బుందా’’ అని మరోవ్యక్తి అన్నారు. ఆ మొత్తంతో ఓ సొంటికి డౌన్ పేమెంట్ చెల్లించొచ్చని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య తెగ ట్రెండవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Dec 29 , 2024 | 08:08 AM