ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ అధికారని తెలీక..

ABN, Publish Date - Feb 25 , 2024 | 04:22 PM

అధిక పార్కింగ్ ఫీజు వసూల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. కారులో సాధారణ దుస్తుల్లో ఉన్నది ఐపీఎస్ అధికారి అని తెలీక నోటికొచ్చినట్టు మాట్లాడి చివరకు జైలు పాలయ్యాడు.

ఇంటర్నె్ట్ డెస్క్: అధిక పార్కింగ్ (Overcharge for parking) ఫీజు వసూల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. కారులో సాధారణ దుస్తుల్లో (Civil disguise) ఉన్నది ఐపీఎస్ అధికారి (IPS Officer) అని తెలీక నోటికొచ్చినట్టు మాట్లాడి చివరకు జైలు పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..


హపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ వర్మ ఇటీవల కారులో బ్రిజ్‌ఘాట్‌కు వెళ్లారు. మరో వ్యక్తి కారును డ్రైవ్ చేస్తుండగా ఆయన డ్రైవర్ పక్క సీటులో ఉన్నారు. ఆయన సివిల్ దుస్తుల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్కింగ్ స్థలం వద్ద ఉన్న వ్యక్తి రూ.53 పార్కింగ్ ఫీజుకు రసీదు ఇచ్చాడు కానీ రూ.60 తీసుకున్నాడు. ఇదేంటని అడిగితే ధరలు రోజూ మారుతుంటాయని చెప్పుకొచ్చాడు. తనతో మాట్లాడుతున్నది ఆఫీసర్ అని తెలీక బుద్ధికి తోచింది మాట్లాడాడు. రూ.60కి బదులు రూ.50 తీసుకుని ఉంటే ఇలాగే మాట్లాడేవారా అంటూ ఎదురు ప్రశ్నసంధించాడు. రూల్స్ ఫాలో కావాలని గద్దించాడు. అయితే, ఈ సంభాషణను ఐపీఎస్ అధికారి మొదటి నుంచీ రికార్డు చేస్తుండటంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అయితే, ఈ ఘటన వెనక ఏదైనా ముఠా ఉండొచ్చన్న అనుమానంతో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలోని వ్యక్తి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

llegal Trading: ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 25 , 2024 | 04:27 PM

Advertising
Advertising