మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: బెడ్రూంలో పెట్టెను శుభ్రం చేస్తుండగా భార్య కంటపడిన దుప్పట్లు.. చివరకు విచారించగా.. భర్త చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Mar 20 , 2024 | 07:01 PM

కొందరు పైకి ఉన్నతోద్యాగాలు చేస్తున్నా.. వారు చేసే పనులు మాత్రం చాలా చీఫ్‌గా ఉంటాయి. మరికొందరు మరీ చిల్లర పనులు చేస్తూ అందరితో ఛీ కొట్టించుకుంటుంటారు. ఇంకొందరు హుందాగా కనిపిస్తూనే వింత వింత చోరీలకు పాల్పడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు..

Viral: బెడ్రూంలో పెట్టెను శుభ్రం చేస్తుండగా భార్య కంటపడిన దుప్పట్లు.. చివరకు విచారించగా.. భర్త చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు పైకి ఉన్నతోద్యాగాలు చేస్తున్నా.. వారు చేసే పనులు మాత్రం చాలా చీఫ్‌గా ఉంటాయి. మరికొందరు మరీ చిల్లర పనులు చేస్తూ అందరితో ఛీ కొట్టించుకుంటుంటారు. ఇంకొందరు హుందాగా కనిపిస్తూనే వింత వింత చోరీలకు పాల్పడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఇల్లు శుభ్రం చేస్తూ పెట్టెను తెరచి చూసింది. చివరకు అందులో దుప్పట్లు, టవళ్లు చూసి షాక్ అయింది. చివరకు విచారణలో భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ ప్రాంతానికి చెందిన అర్షద్ అనే వ్యక్తి ఇదే ప్రాంతంలోని ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఇతడికి రాజస్థాన్‌లోని (Rajasthan) కోట ప్రాంతానికి చెందిన యువతితో జనవరిలో వివాహమైంది. ఇదిలావుండగా, అర్షద్ ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం భార్యతో కలిసి భోపాల్‌లోని ఎయిర్‌పోర్టు రోడ్ దత్తా కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇటీవల వీరి ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రంజాన్ మాసం ప్రారంభమవడంతో ఈద్ పండుగకు ముందు అర్షద్ భార్య.. ఇంటిని శుభ్రం చేసే పని మొదలెట్టింది. ఈ క్రమంలో ఆమె ఇళ్లు మొత్తం శుభ్రం చేస్తూ ఓ పెట్టెను తెరచింది.

Viral video: పిల్లల్ని ఎత్తుకుని షాపింగ్ మాల్ వెళ్తున్నారా.. అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

అయితే ఆ పెట్టెలో దక్షిణ మధ్య, ఇతర రైల్వేకి చెందిన (Railway bed sheets and towels) 30 టవళ్లు, 6 దుప్పట్లు, 40 బెడ్ ఫీట్లు ఉండడం చూసి షాక్ అయింది. చివరకు వాటిని రైల్లో చోరీ చేసినట్లు గుర్తించి, భర్తను నిలదీసింది. ‘‘ఇలా చేయడం తప్పు కదా.. వెంటనే వాటిని వెనక్కు ఇచ్చేయాలి’’.. అని భర్తతో అనడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో భార్యపై దాడి చేసి, విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె భయపడకుండా వాటిని ఫొటోలు తీసి, మొబైల్ యాప్ ద్వారా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే వస్తువులను చోరీ చేయడం నేరమని, అందుకు రైల్వే ఆస్తి చట్టం-1966 ప్రకారం జరిమానాతో పాటూ జైలు శిక్ష కూడా విధించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral video: అరే..! ఇదేం వింత టెక్నిక్.. మాంసం ముద్దను బావిలోకి విసరడంతో..

Updated Date - Mar 20 , 2024 | 07:03 PM

Advertising
Advertising