New Year Celebrations: ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో ఫూల్స్ అవుతారు.. జర జాగ్రత్త
ABN, Publish Date - Dec 31 , 2024 | 09:55 AM
ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు మనకు గుర్తొచ్చేది ఏప్రియల్ ఫూల్.. అబద్ధాన్ని నిజంగా నమ్మించి ఫూల్స్ చేయడం ఈ నెలలో అలవాటు.. కానీ, కొత్త సంవత్సరంలో ఫూల్స్ చేసేందుకు కొందరు మోసగాళ్లు తమ ప్లాన్స్‌తో రంగంలోకి దిగారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జనవరి ఫస్ట్ రోజున ఫూల్స్ అవ్వడం ఖాయం.
ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు మనకు గుర్తొచ్చేది ఏప్రియల్ ఫూల్.. అబద్ధాన్ని నిజంగా నమ్మించి ఫూల్స్ చేయడం ఈ నెలలో అలవాటు.. కానీ ఇటీవల కాలంలో మోసగాళ్లు సమయం, సందర్భం లేకుండా నిత్యం జనాన్ని ఫూల్స్ చేయడం మొదలుపెట్టారు. కొందరు మోసగాళ్ల మాటలు నమ్మి ఫూల్స్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏవైనా ప్రత్యేక పండుగ రోజుల్లో ఇలాంటి తరహా ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్స్ హడావుడి నడుస్తోంది. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నవేళ కొత్త సంవత్సరంలో ఫూల్స్ చేసేందుకు కొందరు మోసగాళ్లు తమ ప్లాన్స్‌తో రంగంలోకి దిగారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జనవరి ఫస్ట్ రోజున ఫూల్స్ అవ్వడం ఖాయం. సాధారణంగా డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట ఎన్నో ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ ఒక బిజినెస్‌గా మారిపోయింది. ప్రతి వ్యక్తిని ఆకర్షించేవిధంగా ఈవెంట్స్ నిర్వహించేవారు కొందరైతే.. ఈవెంట్స్ పేరిట మోసాలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం అంతా ఆన్‌లైలన్ సిస్టమ్ కావడంతో చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ టికెట్లు అందుబాటులో పెడుతున్నారు. దీంతో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. తీరా ఈవెంట్ టైమ్ దగ్గరపడి.. వాళ్లు చెప్పిన ప్లేస్‌కు వెళ్తే అక్కడ ఎలాంటి ఈవెంట్ జరగడంలేదని చెప్పడంతో టికెట్లు కొన్న వ్యక్తులు లబోదిబోమంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా జరుగుతున్నాయి. అందుకే న్యూఇయర్ సెలబ్రేషన్ టికెట్స్ కొనే సమయంలో జరజాగ్రత్తగా వ్యవహారించాలి. లేదంటే మోసపోవాల్సి ఉంటుంది.
తక్కువ రేటు.. ఎక్కువ సౌకర్యాలు..
సాధారణంగా వెయ్యి రూపాయిలకే తిన్నంత ఫుడ్‌తో పాటు లిక్కర్ అని కొందరు ఈవెంట్స్ టికెట్లు సేల్ చేస్తుండగా.. మరికొందరు అన్ లిమిటెడ్ లిక్కర్ కేవలం రూ.వెయ్యి అంటూ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఎవరైనా ఈవెంట్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో మనం చెల్లిస్తున్న అమౌంట్‌కు మెనూలో పేర్కొన్నవాటికి భారీ తేడా ఉంటే ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. మెనూలో ఐటమ్స్‌కు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చయితే.. వెయ్యి రూపాయిలకే టికెట్ అమ్మితే దానిలో మోసం ఉందనే విషయాన్ని గ్రహించాలి. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఈవెంట్లకు వెళ్లేటప్పుడు, ఆ టికెట్లు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. అదే సమయంలో కొంతమంది మెనూలో ఎక్కువ ఐటమ్స్ పెట్టి, ఈవెంట్‌కు వెళ్లిన తర్వాత వాటిని ఇచ్చే అవకాశం ఉండదు. టికెట్ల సేల్ కోసం ఎక్కువ ఐటమ్స్ ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి ఈవెంట్ల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహారించాల్సి ఉంటుంది.
Updated Date - Dec 31 , 2024 | 11:38 AM