Viral: పెళ్లిచేసుకోనున్న మరో అపరకుబేరుడు.. రూ.5 వేల కోట్ల ఖర్చుతో వేడుక
ABN, Publish Date - Dec 22 , 2024 | 08:30 PM
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ త్వరలో పెళ్లి చేసుకున్నారు. వచే శనివారం బ్రాడ్‌కాస్ట్ రిపోర్టర్ లారెన్ శాంఛెస్‌ను పెళ్లాడనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ త్వరలో పెళ్లి చేసుకున్నారు. వచే శనివారం బ్రాడ్‌కాస్ట్ రిపోర్టర్ లారెన్ శాంఛెస్‌ను పెళ్లాడనున్నారు. హాలీవుడ్ నటుడు కెవిన్ కాస్ట్నర్‌కు చెందిన రాంచ్‌లో డిసెంబర్ 28న ఈ వేడుక జరగనున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి (Amazon).
King Charles: నేనింకా బతికే ఉన్నా.. భారత సంతతి వ్యక్తితో బ్రిటన్ రాజు జోక్!
ఇక పెళ్లికి హాజరయ్యే అతిథుల కోసం జెఫ్ బెజోస్ కొలరాడోలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో భారీ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. డిసెంబర్ 26,27 తేదీల్లో ఈ విందు జరగనుందని, కాబోయే జంట ఇప్పటికే అక్కడికి చేరుకుని అతిథుల కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ విందుకు దాదాపు 180 మంది ప్రముఖులు హాజరుకానున్నారట. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో, జార్డన్ రాణి రానియా వంటి అనేక సెలబ్రిటీలు రానున్నట్టు సమాచారం. వింటర్ వండర్ ల్యాండ్ థీమ్‌లో అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు రెస్టారెంట్ మొత్తాన్ని బెజోస్ అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. రెస్టారెంట్‌ను వివిధ రకాల అలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు.
Viral: కోర్టునే ఆశ్చర్యపరిచిన ట్యాక్సీ డ్రైవర్! భార్యకు భరణం చెల్లించమంటే..
ఈ భారీ పెళ్లి వేడుకకు ఆయన మొత్తం రూ.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. అయితే, ఈ విషయంలో జెఫ్, లారెన్ మాత్రం అత్యంత గోప్యత పాటిస్తున్నారు. వేడుక ప్లాన్ చేసేందుకు అనేక మంది వెడ్డింగ్ ప్లానర్లను రప్పించారని, విషయాలను బహిర్గతం చేయొద్దంటూ వారి నుంచి ఒప్పందాలపై సంతాకాలు చేయించుకున్నారని కూడా మీడియా చెబుతోంది.
బెజోస్, శాంఛెజ్ 2018 నుంచి డేటింగ్ చేస్తున్నారు. మొదటి భార్య మెకెన్జీతో జెఫ్ విడాకులు ఖరారయ్యాక ఆయన 2019 జులై 19న తొలిసారిగా తమ బంధం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఇక జెఫ్‌కు ముగ్గురు సంతానం కాగా, శాంఛెజ్‌కు కూడా పిల్లలు ఉన్నారు.
Viral: భారత్‌లో టూర్ తరువాత తీవ్ర విమర్శలు గుప్పించిన బ్రిటీష్ పౌరుడు
ఎవరీ శాంఛెజ్
55 ఏళ్ల లారెన్ శాంఛెజ్ 1969లో అమెరికాలోని ఆల్బఖర్కీ నగరంలో జన్మించారు. ఆమె ఎంటర్‌టైన్మెంట్ రిపోర్టర్‌గా, న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. 2011-17 మధ్య కాలంలో గుడ్ డే ఎల్ఏ మార్నింగ్ షో వ్యాఖ్యాతగా ఉన్నారు. పలు చిత్రాల్లో కూడా నటించారు. జెఫ్ బెజోస్‌కు చెందిన ఎర్త్ ఫండ్ సంస్థ వైస్ చైర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!
Updated Date - Dec 22 , 2024 | 08:30 PM