Viral Video: ఇదేం వింత.. వేపచెట్టుకు వేలాడుతున్న జ్యూసీ మామిడి పండ్లు
ABN, Publish Date - May 27 , 2024 | 01:40 PM
అప్పుడప్పుడు మర్రి చెట్లపై ఇతర మొక్కలు పెరగడం చూసి ఉంటాం. కానీ వేప చెట్టు(neem tree)లో పెరుగుతున్న ఇతర చెట్లను ఎప్పుడైనా చుశారా లేదా అయితే ఇప్పుడు ఆ అరుదైన వింత గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏకంగా వేపచెట్టుకు మామిడి పండ్లు(mangoes) కాయడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది మాత్రం నిజమనే చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అప్పుడప్పుడు మర్రి చెట్లపై ఇతర మొక్కలు పెరగడం చూసి ఉంటాం. కానీ వేప చెట్టు(neem tree)లో పెరుగుతున్న ఇతర చెట్లను ఎప్పుడైనా చుశారా. లేదా అయితే ఇప్పుడు ఆ అరుదైన వింత గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏకంగా వేపచెట్టుకు మామిడి పండ్లు(mangoes) కాయడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది మాత్రం నిజమనే చెప్పవచ్చు. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియోను చెట్టు యజమాని, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్(Prahlad Singh Patel) సోషల్ మీడియా వేదికగా ఇటివల పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ పటేల్(Prahlad Singh Patel) ఇటివల భోపాల్‍లోని తన నివాసాన్ని సందర్శించడానికి వచ్చారు. ఆయన బంగ్లా నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బీ7 బంగ్లాలో పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఆ క్రమంలో పనులు పరిశీలిస్తుండగా ఆయన కళ్లు అక్కడ పెరుగుతున్న వేప చెట్టుపై పడ్డాయి. దూరం నుంచి చూస్తే వేప చెట్టులా కనిపించింది. కానీ దగ్గరకు వెళ్లి చూసేసరికి దానికి కొన్ని చోట్ల మామిడికాయలు కూడా ఉన్నాయి. దీంతో షాకైన మంత్రి చెట్టు వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీంతో ఈ చెట్టు గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున ఆ చెట్టు వద్దకు చేరుకుని వీక్షిస్తున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇదేం విడ్డూరమని అంటున్నారు. ఇంకొంత మంది మాత్రం ఇది ప్రకృతి వైపరిత్యమని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో 280 నెంబర్ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి!
Viral Video: గొరిల్లాలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా? చిన్న పక్షితో స్నేహం కోసం గొరిల్లా ప్రయత్నం చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 27 , 2024 | 01:43 PM