ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: ఫ్లైట్ నుంచి దూకుతానని, సిబ్బందితో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన.. చివరకు ఏమైందంటే

ABN, Publish Date - May 12 , 2024 | 11:16 AM

విమాన(flight) ప్రయాణంలో భాగంగా అప్పుడప్పుడు మంటలు రావడం, ఏసీలు పనిచేయకపోవడం, ప్రయాణికుల వింత చేష్టల వంటి అనేక సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కూడా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఏమైందోనేది ఇక్కడ తెలుసుకుందాం.

misbehavior kerala passenger on air india express

విమాన(flight) ప్రయాణంలో భాగంగా అప్పుడప్పుడు మంటలు రావడం, ఏసీలు పనిచేయకపోవడం, ప్రయాణికుల వింత చేష్టల వంటి అనేక సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కూడా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఏమైందంటే దుబాయ్ నుంచి మంగళూరు(dubai to mangalore) మధ్య ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు(passenger) సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు.


విమానంలో వికృతంగా ప్రవర్తించి, మిగతా ప్రయాణికులకు అవాంతరాలు సృష్టించాడు. అంతేకాదు విమానం నుంచి సముద్రంలోకి దూకేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సర్వీస్ బటన్ నొక్కి సిబ్బందికి చికాకు తెప్పించాడు. పనికిరాని ప్రశ్నలు వేసి విమానంలో ఉన్న లైఫ్ జాకెట్‌ తీసుకుని కిందకు దూకుతానని పలుమార్లు సిబ్బందిని బెదిరించాడు. ఈ సంఘటన మే 9న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి మంగళూరుకు(dubai to mangalore) వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంది.


దీంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం సెక్యూరిటీ కో ఆర్డినేటర్ సిద్ధార్థ్ దాస్ కేరళకు చెందిన మహ్మద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో విమానం మంగుళూరులో ల్యాండ్ అయిన వెంటనే అతన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చట్టపరమైన చర్యల కోసం బజ్పే పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. తరువాత అదే రోజు సాయంత్రం అతనిపై ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు చేశామని పోలీసులు(police) వెల్లడించారు. అతన్ని కేరళ(kerala)లోని కన్నూర్‌కు చెందిన ముహమ్మద్ బీసీగా గుర్తించారు. దుబాయ్ నుంచి మంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఆ వ్యక్తి ప్రయాణించాడు.


ఇది కూడా చదవండి:

Viral Video: స్కూటీపై వచ్చిన మహిళను చూసి హడలెత్తిన ఏనుగు.. సమీపానికి రాగానే అది చేసిన నిర్వాకం..



Viral Video: మ్యాచ్ మధ్యలో పరిగెత్తుకెళ్లి ధోని కాళ్లపై పడిన వీరాభిమాని

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - May 12 , 2024 | 11:20 AM

Advertising
Advertising