ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kalki 2898 AD: ఎట్టకేలకు బుజ్జిని కలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన రియాక్షన్ ఏంటంటే..!

ABN, Publish Date - Jun 13 , 2024 | 09:49 AM

ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రంలో సూపర్ హీరో క్యారెక్టర్ గా ఉన్న బుజ్జి కూడా తెగ వైరల్ అవుతోంది. బుజ్జి ఒక కస్టమ్ మేడ్ రోబోటిక్ వాహనం. అయితే తాజాగా బుజ్జిని మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా కలుసుకున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ప్రపంచానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తెలుగు నటులు పాన్ ఇండియా స్టార్లుగా మారడమే దీనికి కారణం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా ప్రపంచాన్ని తమదైన నటనతో అద్భుతమైన సినిమాలతో ఆకర్షిస్తున్నారు. ఇక ప్రభాస్(Prabhas) అయితే చేస్తే పాన్ ఇండియా సినిమాలే చేస్తా అనే రేంజ్ లో ఉన్నాడు. ఆయన నటించిన కల్కి చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రంలో సూపర్ హీరో క్యారెక్టర్ గా ఉన్న బుజ్జి కూడా తెగ వైరల్ అవుతోంది. బుజ్జి ఒక కస్టమ్ మేడ్ రోబోటిక్ వాహనం. అయితే తాజాగా బుజ్జిని మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వాహనం తయారీ వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి . వీటి గురించి తెలుసుకుంటే..

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!


ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. సోషల్ మీడియాకు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో తన అనుచరులకు కొత్త విషయాలను పరిచయం చేస్తూ, ప్రేరణాత్మక వీడియోలు షేర్ చేస్తూ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు ఈయన. అయితే ఈయనకు, ప్రభాస్ తాజాగా నటించి విడుదలకు సిద్దంగా ఉన్న కల్కి సినిమాకు ఓ లింక్ ఉంది. అదే కల్కి సినిమాలో ఉన్న సూపర్ హీరో బుజ్జి. కస్టమ్ మేడ్ రోబోటిక్ వాహనం అయిన బుజ్జిని తయారు చేయడంలో మహీంద్రా సంస్థ సహకారం చాలా ఉంది. కోయంబత్తూరుకు చెందిన జయం మోటార్స్ తో కలిసి చెన్నైకు చెందిన మహీంద్రా గ్రూప్ టీమ్ బుజ్జిని తయారుచేసింది.

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


కల్కి సూపర్ హీరో బుజ్జిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గోవా, ముంబై వంటి నగరాల్లో ప్రదర్శించారు. భారతదేశ మొదటి ఫార్ములా 1 డ్రైవర్ నరైన్ కార్తికేయన్, సినీ నటుడు నాగ చైతన్య వంటి ప్రముఖులు దీన్ని నడిపారు. తాజాగా మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ముంబైలో బుజ్జిని కలుసుకున్నారు. Kalki 2898 AD అనే ట్విట్టర్ ఎక్స్ (Twitter X)అకౌంట్ నుండి చిత్రం టీమ్ ఒక వీడియోను షేర్ చేసింది. 'ఆనంద్ మహీంద్రా బుజ్జిని కలుసుకున్నాడు' అని క్యాప్షన్ మెన్షన్ చేసింది. వీడియోలో ఆనంద్ మహీంద్రా స్వయంగా బుజ్జిని పరిశీలించడం, వాహనాన్ని నడపడం చూడొచ్చు. తదనంతరం ఆయన చాలా సంతృప్తిగా ఉన్నట్టు కూడా కనిపిస్తారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 13 , 2024 | 09:49 AM

Advertising
Advertising