ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

King Charles: నేనింకా బతికే ఉన్నా.. భారత సంతతి వ్యక్తితో బ్రిటన్ రాజు జోక్!

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:13 PM

క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని తూర్పు లండన్‌లో ఏర్పాటు చేసిన ఓ విందుకు హాజరైన బ్రిటన్ రాజు కింగ్ చార్ల్స్ భారత సంతతి వ్యక్తితో చేసిన హాస్యసంవాదం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని తూర్పు లండన్‌లో ఏర్పాటు చేసిన ఓ విందుకు హాజరైన బ్రిటన్ రాజు కింగ్ చార్ల్స్ భారత సంతతి వ్యక్తితో చేసిన హాస్యసంవాదం ప్రస్తుతం వైరల్‌గా మారింది. డిసెంబర్ 20న వాల్థమ్ ఫారెస్ట్‌ హాల్‌లో విందును ఏర్పాటు చేశారు. స్థానికుల మధ్య ఐక్యతకు సూచిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బ్రిటన్ రాజు చార్ల్స్‌తో పాటు రాణి కెమిల్లా కూడా హాజరయ్యారు (Viral).

Viral: కోర్టునే ఆశ్చర్యపరిచిన ట్యాక్సీ డ్రైవర్! భార్యకు భరణం చెల్లించమంటే..


స్థానిక యువత, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్లు, కమ్యూనిటీ వలంటీర్లు, వివిధ మతాల ప్రతినిధులు హాజరైన ఈ విందులో భారత సంతతి వ్యక్తి హర్వీందర్ రత్తన్ తొలుత బ్రిటన్ రాజును పలకరించారు. ‘‘యూవర్ మెజిస్టీ.. గుడ్ మార్నింగ్.. మీరు ఎలా ఉన్నారు’’ అని మర్యాదపూర్వకంగా అడిగారు. అయితే, రాజు ఏమాత్రం తడుముకోకుండా నేనికంగా బతికే ఉన్నాను అంటూ సరదాగా జోకేశారు. దీంతో, అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.

బ్రిటన్ రాజు క్యాన్సర్ బారిన పడిన విషయం ఈ ఏడాది మొదట్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఘటనపై స్పందించిన బకింగ్‌హ్యామ్ పాలెస్.. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వ్యాధి అదుపులోనే ఉందని చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది కూడా చికిత్స కొనసాగుతుందని వెల్లడించింది.

Viral: భారత్‌లో టూర్ తరువాత తీవ్ర విమర్శలు గుప్పించిన బ్రిటీష్ పౌరుడు


ఇక వాల్థమ్ హాల్ విందులో రాణి కూడా పెద్ద మనసును చాటుకున్నారు. శరణార్థి హాస్టల్‌లలో తలదాచుకుంటున్న అనాథ బాలబాలికలకు బొమ్మలు పంపిణీ చేశారు.

కాగా, అంతకుమునుపు, రాజకుటుంబసభ్యులకు ఏర్పాటు చేసిన విందులో కూడా కింగ్ చార్ల్స్ , రాణి కెమిల్లా పాల్గొన్నారు. ఈ విందులో రాజకుటుంబానికి చెందిన వారందరూ పాల్గొని వేడుక నిర్వహించారు. రాజకుటుంబానికి చెందిన వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఏటా ఈ విందును ఏర్పాటు చేస్తారు. కాగా, ఈ విందుకు సంబంధించిన వీడియోలను బకింగ్‌హ్యామ్ పాలెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 22 , 2024 | 03:13 PM