Share News

Kitchen Hacks: టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా ఏంటి?

ABN , Publish Date - Sep 19 , 2024 | 10:48 AM

కుకింగ్ రీల్స్ చేసేవారు ఉప్పు, కారం, ఇతర మసాలాలు మొదలైనవి టేబుల్ స్పూన్, టీ స్పూన్ వంటి కొలతలతో చెబుతుంటారు. అసలు టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా తెలియక చాలా మంది వంటలో పొరపాట్లు చేస్తుంటారు.

Kitchen Hacks: టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా ఏంటి?

పాకశాస్త్రం ఓ గొప్ప కళ. నలుగురి ఆకలి తీర్చడం మాత్రమే కాదు రకరకాల రుచులను ఔరా అనిపించేలా వండటం కూడా పాశశాస్త్రంలో నిపుణులకు చెల్లుతుంది. ఇక సాధారణ వ్యక్తులకు ఈ మధ్యకాలంలో వండటం అనేది ఫ్యాషన్ గా మారింది. ప్రోఫెషనల్ గా వంట చేసేవారు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో కుకింగ్ రీల్స్ చేసేవారు ఉప్పు, కారం, ఇతర మసాలాలు మొదలైనవి టేబుల్ స్పూన్, టీ స్పూన్ వంటి కొలతలతో చెబుతుంటారు. అసలు టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా తెలియక చాలా మంది వంటలో పొరపాట్లు చేస్తుంటారు. దీని కారణం వల్ల వంట మొత్తం పాడవుతుంది. టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా తెలుసుకుంటే..

రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!


టేబుల్ స్పూన్..

  • టేబుల్ స్పూన్ పరిమాణంలో పెద్దగా ఉంటుంది. ఇది టీస్పూన్ కంటే చాలా పెద్ది. మూడు టీ స్పూన్లు కలిస్తే టేబుల్ స్పూన్ కు సమానం.

  • మిల్లిలీటర్లలో అర్థం చేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ సుమారు 15మిల్లీలీటర్లకు సమానం. ఇక టీస్పూన్ అయితే 5మిల్లీలీటర్లకు సమానం. మిల్లీలీటర్లలో కూడా టీస్పూన్ కంటే టేబుల్ స్పూన్ మూడు రెట్లు పెద్ది.

  • టేబుల్ స్పూన్ ను సాధారణంగా ద్రవ పదార్థాల కోసం, శనగపిండి, బియ్యం పిండి వంటివి వేసుకోవడం కోసం, కాఫీ, టీ పౌడర్ వేసుకోవడానికి, పంచదార వంటివి వేసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ టీ స్పూన్ మాత్రం ఉప్పు, కారం, మసాలా పొడులు వంటి సుగంధ ద్రవ్యాలు వేయడానికి ఉపయోగిస్తారు.

మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!


  • కొంతమంది టేబుల్ స్పూన్ ను, టీ స్పూన్ ను ప్రస్తావించడానికి చాలా స్మార్ట్ లాంగ్వేజ్ కూడా వాడతారు. కొందరు టేబుల్ స్పూన్ ను పెద్ద అక్షరంతో "T" అని వాడితే.. టీస్పూన్ ను ప్రస్తావించడానికి "t" అని వాడతారు. అంటే T అంటే పెద్ద చెంచా, t అంటే చిన్న చెంచా అని అర్థం.

ఇవి కూడా చదవండి..

నానబెట్టిన ఎండుద్రాక్షను నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!

రోజుకొక యాపిల్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 19 , 2024 | 10:48 AM