Viral: యాచకుడిలా నటించిన వ్లాగర్ ! రోజంతా భిక్షాటనతో ఎంతొచ్చిందంటే..
ABN , Publish Date - Dec 12 , 2024 | 07:23 PM
భిక్షగాళ్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ వ్లాగర్ 24 గంటల పాటు యాచకుడిగా మారిన తీరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లు వ్యూస్ కోసం పాప్యులారిటీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యువర్స్‌ను ఆకట్టుకునేందుకు కొంగొత్త కంటెంట్‌తో ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్లాగర్ తాజాగా చేసిన ప్రయత్నం నెటిజన్లను అమితంగా ఆశ్చర్యపరుస్తోంది. భిక్షగాళ్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అతడు 24 గంటల పాటు యాచకుడిగా మారిన తీరు చూసి నోరెళ్లబెడుతున్నారు (Viral).
Viral: పాము, ముంగిస మధ్య జాతి వైరం ఎందుకో తెలుసా?
కోల్‌కతాకు చెందిన పంతా దేబ్.. యాచకుల సంపాదన ఎంతో తెలుసుకునేందుకు ఈ వింత ప్రయత్నం చేశాడు. ‘‘24 గంటల పాటు యాచకుడిగా..’’ అన్న క్యాప్షన్‌తో తన ప్రయగం తాలూకు వీడియో పోస్టు చేశాడు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, అతడు చిరిగిన జీన్స్, టీ షర్టు ధరించి ఓ బస్ స్టాప్‌లో చేతులు చాచి యాచించాడు. బస్‌స్టాప్‌లో వచ్చే పోయే వారిని డబ్బులు వేయ్యాలంటూ చేతులో ఓ గిన్నె పట్టుకుని వేడుకున్నాడు. ఇలా రోజంతా యాచించినా అతడికి రూ.34 మించి రాలేదు.
Britain: క్రిమినాలజీ విద్యార్థి దారుణం! హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని..
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన అతడు తనకొచ్చిన మొత్తాన్ని వీధుల్లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి ఇచ్చేశానని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది దేబ్ ప్రయత్నంపై తమ అభిప్రాయాలను నిష్కర్షగా పంచుకున్నారు. కొందరు అతడి ప్రయత్నాన్ని అభినందించారు. సమాజానికున్న ఓ కోణాన్ని జనాలకు పరిచయం చేశాడని అన్నారు. కొందరు మాత్రం విమర్శలకు దిగారు. సమాజం తీరుతెన్నులపై ఆరోగ్యకర విమర్శకు మూర్ఖత్వానికి మధ్య తేడా చెరిగిపోతోందని అన్నారు. వ్యూస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా అని మరో వ్యక్తి ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.