ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భారత్‌ను వీడండి! ఇదే తగిన సమయం: స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకుడి షాకింగ్ కామెంట్

ABN, Publish Date - Dec 22 , 2024 | 10:12 PM

మంచి శాలరీలు పొందుతున్న ప్రొఫెషనల్స్ భారతీయులు స్వదేశాన్ని వీడేందుకు ఇదే తగిన సమయం అంటూ ఓ స్టార్టప్ సంస్థ సీఈఓ రెడిట్ వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంటర్నెట్ డెస్క్: మంచి శాలరీలు పొందుతున్న భారతీయ ప్రొఫెషనల్స్ స్వదేశాన్ని వీడేందుకు ఇదే తగిన సమయం అంటూ ఓ స్టార్టప్ సంస్థ సీఈఓ రెడిట్ వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మండిపడ్డుతున్నారు (Viral).

ఇండియాలో సృజనాత్మకతకు గుర్తింపు తక్కువని సదరు ఆంత్రప్రెన్యూర్ చెప్పుకొచ్చారు. ‘నేను ఇండియాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదివా. ఆ తరువాత అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. అక్కడ ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేసి 2018లో నా సంస్థ ఏర్పాటు చేసుకునేందుకు భారత్‌కు వచ్చా’’

Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు


‘‘ప్రస్తుతం నా వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నా. నా వద్ద 30 మంది ఉద్యోగులున్నారు. వారి సగటు శాలరీ 15 లక్షలు. కానీ మీరు ఇండియాను వీడేందుకు ఇదే తగిన సమయం. ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ నడుపుతున్న వ్యక్తిగా నేను ఇది చెబుతున్నాను’’ అని సుదీర్ఘ పోస్టు పెట్టుకొచ్చారు. ఇందుకు గల కారణాలను కూడా వివరించారు.

భారత్‌లో మూర్ఖపు నిబంధనల కారణంగా సృజనాత్మకత చచ్చిపోతోందని అన్నారు. ఇక్కడ పని జరిపించుకోవాలంటే ప్రభుత్వాధికారో లేదా రాజకీయనాయకుడో లేదా సెలబ్రిటీనో అయి ఉండాలని వాపోయారు. తన యాప్‌కు సంబంధించి ఓ ఫ్రాడ్ కేసులో నిందితుడిని పట్టించేందుకు తాము సహకరించినా, బాధితుడికి డబ్బు తిరిగొచ్చేసినా ఇంకా కేసు మూత పడలేదని, చివరకు తాము ముద్దాయిగా మారామని ఆవేదన వ్యక్తం చేశారు.

Viral: పెళ్లిచేసుకోనున్న మరో అపరకుబేరుడు.. రూ.5 వేల కోట్ల ఖర్చుతో వేడుక


ప్రాంతీయ బేధాల కారణంగా కూడా వివక్ష ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చారు. ఉద్యోగుల్లో నిజాయతీ నిబద్ధత కూడా చెప్పారు. అధిక పన్నులు చెల్లిస్తున్నా మంచి రోడ్లు, ఇతర మౌలిక వసతులు అందడంలేదని అన్నారు. ప్రజల్లో సివిక్ సెన్స్ లేనేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో ఆర్థికంగా కుప్పకూలొచ్చని, రూపాయి విలువ భారీగా తగ్గుతోందని హెచ్చరించారు. సృజనాత్మకత ఉన్న వారు యూఏఈ, థాయ్‌లాండ్ లాంటి దేశాలను ఎంచుకోవాలని సూచించారు. పన్నుల భారం ఇంకా పెరుగుతుందని అన్నారు. దీంతో ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 22 , 2024 | 10:18 PM