మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఒకే ఇంటిపై చిరుత, ఎలుగుబంటి.. చివరకు ఏమైందో చూడండి..

ABN, Publish Date - Apr 06 , 2024 | 04:57 PM

అటవీ సమీప ప్రాంతాల్లో అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఏనుగులు, పులులు, సింహాలు.. సమీప గ్రామాల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంట సమయాల్లో కొన్నిసార్లు మనుషులు, జంతువులు కూడా వాటి బారిన పడడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు...

Viral Video: ఒకే ఇంటిపై చిరుత, ఎలుగుబంటి.. చివరకు ఏమైందో చూడండి..

అటవీ సమీప ప్రాంతాల్లో అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఏనుగులు, పులులు, సింహాలు.. సమీప గ్రామాల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంట సమయాల్లో కొన్నిసార్లు మనుషులు, జంతువులు కూడా వాటి బారిన పడడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు అడవి జంతువులు ఏకంగా ఇళ్లల్లోకి కూడా చొరబడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఊటీలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చిరుతపులి, ఎలుగుబంటి కలిసి ఒకే ఇంటి మేడపైకి చేరుకున్నాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

తమిళనాడులోని ఊటీ (Ooty, Tamil Nadu) పరిధి యెల్లనల్లి కైకట్టి గ్రామంలో ఏప్రిల్ 5న ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి మేడపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో (CC camera) షాకింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. స్థానిక అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత (cheetah) .. యెల్లనల్లి కైకట్టి గ్రామానికి చేరుకుంది. నేరుగా ఓ ఇంటి మేడ పైకి చేరింది. అయితే దానికి అక్కడ ఎలాంటి ఆహారం లేకపోవడంతో అటూ ఇటూ చూసి, చివరకు గోడ దూకి కిందకు వెళ్లిపోయింది. అది వెళ్లిన కాసేపటికి పెద్ద ఎలుగుబంటి (bear) కూడా అక్కడికి చేరుకుంది. అది కూడా చిరుతపులి తరహాలో అటూ ఇటూ చూసి చివరకు చిరుత వెళ్లిన మార్గంలో వెళ్లిపోయింది.

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..

చిరుతపులి, ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘చిరుత, ఎలుగుబంటి కలిసి మీటింగ్‌కు అటెండ్ అయ్యాయేమో’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Puzzle: ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా.. ?

Updated Date - Apr 06 , 2024 | 04:57 PM

Advertising
Advertising