Viral Video: నమ్మశక్యం కాని వీడియో.. భారీ పర్వతాలపై చిరుతలు ఎలా గెంతుతున్నాయో చూడండి..!
ABN , Publish Date - Aug 10 , 2024 | 08:09 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వన్య ప్రాణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్ని వీడియోలు తర్వాత మన కళ్లను మనమే నమ్మలేనంత అద్భుతంగా ఉంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్ని వీడియోలు తర్వాత మన కళ్లను మనమే నమ్మలేనంత అద్భుతంగా ఉంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో రెండు చిరుత పులుల (Snow Leopards) అద్భుత విన్యాసం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు చిరుత పులులు అద్భుతమైన వేగంతో పరిగెడుతూ, గెంతుతూ భారీ పర్వత శిఖరానికి (Mountain) చేరుకుంటున్నాయి. అవి మంచు ప్రాంతాల్లో నివసించే చిరుతపులులు. ఇవి మధ్య, దక్షిణ ఆసియాలోని కఠినమైన పర్వత శ్రేణులలో నివసిస్తాయి. హిమాలయాలు, పామిర్లు మరియు ఆల్టై పర్వతాలలో కనిపిస్తాయి. కఠినమైన వాతావరణానికి పూర్తి అనుగుణంగా వాటి శరీర నిర్మాణం ఉంటుంది. మందపాటి బొచ్చు, పొడవాటి తోకలు, శక్తివంతమైన అవయవాలతో ఉంటాయి.
అవి అత్యంత వేగంగా, నైపుణ్యంతో పర్వతాలను అధిరోహిస్తాయి. మన దేశంలోని మంచు ప్రాంతాల్లో 718 మంచు చిరుతలు ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. కాగా, సోషల్ మీడియాలో ఈ మంచు చిరుతలకు సంబంధించిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 33 లక్షల మందికి పైగా వీక్షించారు. 62 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు.. మొసలి నోటి నుంచి తాబేలు ఎలా తప్పించుకుందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి