Viral Video: చనిపోయిన నీటి గుర్రాన్ని తింటున్న హైనాలు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహాలు.. చివరకు..
ABN, Publish Date - Aug 08 , 2024 | 07:51 AM
సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా అవి వెంటబడి వెంటబడి మరీ దాడి చేస్తాయి. చివరకు వాటి పంజాతో మట్టి కరిపిస్తాయి. అయితే సింహాలు కూడా కొన్నిసార్లు కొన్ని జంతువులను ఏమార్చి ...
సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా అవి వెంటబడి వెంటబడి మరీ దాడి చేస్తాయి. చివరకు వాటి పంజాతో మట్టి కరిపిస్తాయి. అయితే సింహాలు కూడా కొన్నిసార్లు కొన్ని జంతువులను ఏమార్చి దొంగచాటుగా దాడి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొన్ని హైనాలు చనిపోయిన నీటి గుర్రాన్ని తింటున్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన సింహాలు.. వాటిని ఏమార్చి ఉన్నట్టుండి దాడికి పాల్పడ్డాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) గ్రేటర్ క్రుగర్ నేషనల్ పార్క్ కన్సర్వెన్సీలోని ప్రైవేట్ గేమ్ రిజర్వ్ అయిన సబీ సాండ్స్ నేచర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన నీటి గుర్రాన్ని మూడు హైనాలు (Hyenas) తింటుంటాయి. అయితే అదే సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.
దూరం నుంచి హైనాలను గమనిస్తున్న ఓ సింహం అటుగా వస్తుంది. వాటిని ఏమార్చి (Lion attack on hyenas) ఉన్నట్టుండి దాడికి దిగుతుంది. ఊహించని ఈ దాడితో ఉలిక్కిపడిన హైనాలు తలో దిక్కుకు పరుగులు పెడతాయి. అయితే వాటిలో ఓ హైనా చివరకు సింహానికి దొరికిపోతుంది. దాని మెడను గట్టిగా పట్టుకున్న సింహం చాలా సేపు అలాగే పట్టుకుని ఉంటుంది. దాన్నుంచి విడిపించుకునేందుకు హైనా శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ దాని వల్ల సాధ్యం కాదు. చివరకు సింహం దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.
Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..
అదే సమయంలో అక్కడికి వచ్చిన మరికొన్ని సింహాలు చనిపోయిన నీటి గుర్రాన్ని తింటాయి. ఈ ఘటన మొత్తం పార్కులోకి వాహనాల్లో వచ్చిన సందర్శకుల సమక్షంలోనే జరుగుతుంది. ఈ ఘటనను మొత్తం వారి కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హైనాలను ఏమార్చిన సింహాలు’’.. అంటూ కొందరు, ‘‘ప్రకృతి ఎంద అందమైనదో.. అదే సమయంలో అంతే క్రూరమైనది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: జింక మాంసం కోసం హైనాల పోరాటం.. దాచిపెట్టడానికి చిరుతల ఆరాటం.. చివరకు..
Updated Date - Aug 08 , 2024 | 07:51 AM