ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పిల్లాడి ముందు ఫూల్ అయిన సింహం.. వేటాడాలని వస్తే.. చివరికి..

ABN, Publish Date - May 12 , 2024 | 12:46 PM

కొందరు పులులు, సింహాలతో పరాచకాలు ఆడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరికొందరు వాటితో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. అలాగే మరికొన్ని సార్లు జంతువులు చిన్న పిల్లలతో ఆడుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి...

కొందరు పులులు, సింహాలతో పరాచకాలు ఆడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరికొందరు వాటితో చిన్నపిల్లల తరహాలో ఆడుకుంటుంటారు. అలాగే మరికొన్ని సార్లు జంతువులు చిన్న పిల్లలతో ఆడుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వేటాడాలని ప్రయత్నించి.. పిల్లాడి ముందు ఓ సింహం ఫూల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పర్యాటకులు జూలో ఉన్న సింహాన్ని చూసేందుకు వెళ్తారు. ఈ సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సింహం ఎన్‌క్లోజర్‌లో (Lion enclosure) ఏర్పాటు చేసిన అద్దం ముందు ఓ చిన్నారి నిలబడి ఉంటుంది. దూరంగా ఉన్న సింహాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. అదే సమయంలో చిన్నారిని గమనించిన సింహం.. వేటాడేందుకు సిద్ధమవుతుంది. అయితే చిన్నారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నేలపై నక్కి నక్కి చూస్తుంది. ఈ క్రమంలో చిన్నారి వెనక్కు తిరిగి నిల్చుంటాడు.

Viral Video: యువతి తాపత్రయం చూసి జాలిపడ్డ గుర్రం.. చివరికి ఎలాంటి సాయం చేసిందంటే..


చిన్నారి అటువైపు తిరగడం చూసిన సింహం.. ఇదే సరైన సమయం అనుకుని దాడికి దిగుతుంది. వేగంగా పిల్లాడి వద్దకు వెచ్చి పంజా విసురుతుంది. అయితే అక్కడ అందం ఉందనే విషయం తెలీని సింహం.. చివరికి అవాక్కతుంది. అయితే సింహం దగ్గరగా రావడం చూసి చిన్నారి ఉలిక్కిపడుతుంది. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాన్ని ఫూల్ చేసిన చిన్నారి’’.. అంటూ కొందరు, ‘‘చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రోటీన్‌కు భిన్నంగా వరుడు.. వధువు దండ వేస్తున్న సమయంలో..

Updated Date - May 12 , 2024 | 12:46 PM

Advertising
Advertising