Viral Video: సరసాలు ఆడబోయిన సింహానికి షాక్.. ఆడ సింహాన్ని నిద్ర లేపాలని చూడడంతో...
ABN, Publish Date - May 23 , 2024 | 08:48 PM
సింహాలు చూసేందుకు ఎంత భయంకరంగా ఉన్నా.. కొన్నిసార్లు వాటి మధ్య కూడా తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల తరహాలో మగ సింహాలకూ కొన్నిసార్లు ఆడ సింహాల నుంచి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి...
సింహాలు చూసేందుకు ఎంత భయంకరంగా ఉన్నా.. కొన్నిసార్లు వాటి మధ్య కూడా తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల తరహాలో మగ సింహాలకూ కొన్నిసార్లు ఆడ సింహాల నుంచి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆడసింహంతో సరసాలు ఆడాలని చూసిన మగ సింహానికి చివరకు పెద్ద షాక్ తగిలింది. పడుకున్న ఆడ సింహాన్ని నిద్రలేపడానికి ప్రయత్నించడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలోని దారిలో ఓ ఆడ సింహం పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మగ సింహం వస్తుంది. ఆడ సింహం పడుకుని ఉండడాన్ని గమనించిన మగసింహం.. దాంతో సరసాలు ఆడాలని దగ్గరికి వెళ్తుంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పడుకున్న సింహం వద్దకు వెళ్లి ఒక్కసారిగా తలను తగిలించి నిద్రలేపుతుంది. దీంతో గాఢనిద్రలో ఉన్న ఆడ సింహానికి కోపం కట్టలు తెంచుకుంటుంది.
Viral Video: వధువు ఎదుటే యువతితో సెల్ఫీ దిగాడు.. చివరకు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..
ఉలిక్కిపడి నిద్రలేచిన ఆడ సింహం.. ‘‘ప్రశాంతంగా పడుకుని ఉంటే.. అనసవరంగా వచ్చి చెడగొడతావా.. ఉండు నీ పని చెబుతా’’.. అన్నట్లుగా కోపంతో మగ సింహంపై గాండ్రిస్తూ దాడికి దిగుతుంది. ఆడ సింహం ఆవేశం చూసిన మగ సింహం ఖంగుతింటుంది. చివరకు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొత్తానికి మగ సింహానికి చుక్కలు చూపించిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ మగ సింహం వేషాలు.. మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.2 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..
Updated Date - May 23 , 2024 | 09:03 PM