Viral Video: కిచెన్‌లో అక్కాచెల్లెళ్ల మధ్య ఫైటింగ్.. వారి తిట్లు వింటే వన్స్‌మోర్ అనాల్సిందే.. వీడియో వైరల్!
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:14 PM
అక్కాచెల్లెళ్ల మధ్య ఫైటింగ్ అంటే మామూలుగా ఉండదు. ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి వాదించుకుంటారు. అది ఎడతెరిపి లేకుండా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న వారికి తలనొప్పి మొదలవుతుంది. వారు ఎప్పుడు గొడవ ఆపుతారా అని ఎదురుచూస్తుంటారు.
అక్కాచెల్లెళ్ల (Sisters) మధ్య ఫైటింగ్ (Fighting) అంటే మామూలుగా ఉండదు. ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి వాదించుకుంటారు. అది ఎడతెరిపి లేకుండా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న వారికి తలనొప్పి మొదలవుతుంది. వారు ఎప్పుడు గొడవ ఆపుతారా అని ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని అక్కాచెల్లెళ్ల గొడవ చాలా శ్రావ్యంగా ఉంది. వారు ఎప్పటికీ గొడవ ఆపకుండా ఉంటే బాగుణ్ను అనుకునేలా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
shreyadubey అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో షాలిని దూబే, శ్రేయ దూబే అనే ఇద్దరు సోదరీమణులు కిచెన్‌లో ఉన్నారు. వారిలో ఒకమ్మాయి రోటీల కోసం పిండి కలుపుతోంది. వెనుక నుంచి సోదరి వచ్చి ``స రి గ మ ప`` అంటూ పిండిలో ఏదో కలపమని చెప్పింది. దానికి ఆమె కూడా సంగీతంతోనే బదులిచ్చింది. వారిద్దరూ ఒకరితో ఒకరు ఒక్కమాట కూడా మాట్లాడుకోరు. వారి మధ్య కేవలం స్వరాలతో మాట్లాడుకున్నారు (Melodious Fight).
వివిధ స్థాయుల్లో, మధుర గాత్రాలతో ఇద్దరూ వంట గదిలో స్వర సమరం సాగించారు. చివరకు వారి చేతుల్లో ఉన్న పిండి పాత్ర కింద పడిపోయింది. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోట్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 19 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``ఇది మెలోడియస్ ఫైట్``, ``అద్భుతమైన గొడవ``, ``ఈ ఫైటింగ్ ఆగకూడదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Shocking Video: నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి కిడ్నాప్.. పుణెలో పట్టపగలే దారుణం.. వీడియో వైరల్!
Viral: ఢిల్లీలో అంతే.. తల్లి ప్రేమగా పంపిన లడ్డూ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. నివ్వెరపోయిన కూతురు!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..