ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: ఇంటింటా తిరుగుతూ అయోధ్య రాములవారి అక్షింతలు పంచుతున్న చిన్నోడు.. వీడియో వైరల్

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:27 PM

అయోధ్య రాములవారి అక్షింతలను ఇంటింటా తిరుగుతూ అందిస్తున్నాడు చిన్న పిల్లవాడు. వాటిని ఏం చేయాలో చక్కగా వివరిస్తున్నాడు. అక్షింతలను పూజ మందిరంలో ఉంచి ఐదు దీపాలను వెలిగించాలని చెబుతున్నాడు. తులసీ మొక్క వద్ద ఓ దీపం వెలిగించాలని సూచించాడు.

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. అందుకు సంబంధించి రామ జన్మభూమి ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. దాంతో అయోధ్యపురి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హైదరాబాద్ నుంచి రాములొరికి పాదుకలు, తిరుమల నుంచి లడ్డూలు, అత్తారింటి నుంచి కానుకలు అందనున్నాయి. అయోధ్య నుంచి రాములొరి అక్షింతలు ఇంటింటికీ చేరుతున్నాయి. ఓ పిల్లవాడు ఆ అక్షింతల గొప్పతనం గురించి చెబుతున్నాడు. వాటిని తీసుకునేందుకు జనం ఆతృతతో ఉన్నారు. నెత్తిన చల్లుకుంటే మంచిదని, రాములొరి ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తున్నారు.

దీపాలు వెలిగించి

అయోధ్య ( Ayodhya Ram Mandir) రాములవారి అక్షింతలను ఏం చేయాలో చక్కగా పిల్లవాడు వివరిస్తున్నాడు. అక్షింతలను పూజ మందిరంలో ఉంచి ఐదు దీపాలను వెలిగించాలని చెబుతున్నాడు. తులసీ మొక్క వద్ద ఓ దీపం వెలిగించాలని సూచించాడు. పిల్లవాడు (Child) చెబుతుండగా ఓ మహిళ (Woman) ఆసక్తిగా వింటున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ చక్కర్లు కొడుతుంది.

అక్షింతలు ఇచ్చి

పిల్లవాడు రెండు చిన్న బ్యాగులను భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. ఒక దానిలో అక్షింతలు ఉన్నాయి. వాటిని ఇంటింటికి తిరుగుతూ పంచుతున్నాడు. మరోదానిలో పిల్లనగ్రోవి ఉంది. అక్షింతలు ఇచ్చి, ఏం చేయాలో చెప్పిన తర్వాత పాట పడుతున్నాడు. చివరలో జై శ్రీరామ్ అన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

అక్షింతలను ఏం చేయాలి..?

అక్షింతలు తీసుకున్న తర్వాత ఏం చేయాలనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దేవుని పూజ మందిరంలో ఉంచాలి. ఇంట్లో ఉన్న అక్షింతలతో వృద్ధి (కలపాలి) చేసుకోవాలి. అక్షింతలను పూజ సమయంలో వాడుకోవాలి. పిల్లలను దీవించేందుకు ఉపయోగించుకోవాలి. భర్త నుంచి భార్య ఆశీస్సులు దీసుకోవాలి. బీరువాలో పెట్టుకోవడం వల్ల కలిసి వస్తుంది. పిల్లల పుట్టిన రోజు, పెళ్లి, ఇతర శుభకార్యాలలో అక్షింతలతో దీవించాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు, శుభకార్యాలు, ఉద్యోగంలో ప్రమోషన్ల సమయంలో ఆశీర్వాదం తీసుకునేందుకు వస్తే వినియోగించుకోవాలని పండితులు చెబుతున్నారు.

ఆలయానికి వెళ్లాలి

జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ రోజున ఉదయం లేచి స్నానం చేసుకోవాలి. ఇంటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఉదయం 11 గంటల సమయంలో గ్రామంలోని ఆలయానికి చేరుకోవాలి. అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ వద్ద అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి తరించాలి. స్థానికంగా పూజారులు ఇచ్చే హారతి తీసుకుని కళ్లకు అద్దుకోవాలి. ప్రసాదం తీసుకుని రాములవారిని స్మరించుకోవాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 02:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising