Viral: ఖతర్ యువరాణి తన ప్రేమలో పడిందనుకుని భార్యకు విడాకులు! చివరకు జైలుపాలు!
ABN, Publish Date - Dec 29 , 2024 | 01:47 PM
ఖతర్ యువరాణి తన ప్రేమలో పడిందని భావించిన ఆమె కారు డ్రైవర్ చివరకు చిక్కుల్లో పడ్డాడు. ఆమె వెంటపడి ఇబ్బందికి గురి చేసినందుకు కోర్టు నిందితుడికి ఏడాది పాటు కారాగార శిక్ష విధించింది. అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటకీ యువరాణి మనోవేదన దృష్ట్యా ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఖతర్‌కు చెందిన ఓ యువరాణి వద్ద కొంతకాలం కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఈ సందర్భంలో ఆమెతో మాట కలిసింది. అప్పటికే ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ ఆ డ్రైవర్ తనదైన ఊహాలోకంలో తేలిపోయాడు. యువరాణి తనను ప్రేమిస్తోందనుకున్నాడు. ఆదే స్పీడులో భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. కానీ డ్రైవర్ అసలు ఉద్దేశం తెలిసి యువరాణి ఫిర్యాదు చేయడంతో చివరకు జైలు పాలయ్యాడు. అతడి మానసిక ఆరోగ్యం సరిగాలేక భ్రమల్లో బతికాడని నిందితుడి తరపు న్యాయవాది వాదించినా కోర్టు ఖాతరు చేయలేదు. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
Viral: స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చినందుకు ఊస్టింగ్.. బాధితురాలికి రూ.32 లక్షల పరిహారం!
కోర్టు వివరాల ప్రకారం, నిందితుడు అబూ సలాహ్ ఖతర్ యువరాణి హయా అల్ థానీ వద్ద ఈ ఏడాది మర్చి 1 నుంచి మార్చి 23 వరకూ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో యువరాణి అతడిని మర్యాదపూర్వకంగా పలకరించేది. అయితే, అప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్న అతడు తన మనసులో ఆమె కేంద్రంగా ఓ ఊహాలోకాన్నే సృష్టించుకున్నాడు. ఆమె తన ప్రేమలో పడిపోయిందనుకున్నాడు. ఆ తరువాత కూడా ఆమె వెంటపడ్డాడు. ఆమె ఇంటికి పుష్ఫగుచ్ఛాలు పంపించేవాడు. యువరాణి సిబ్బందికి బహుమతులు ఇచ్చి ఆమెకు ఇవ్వమని పురమాయించాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో యువరాణి భయపడిపోయింది. తన రోజూవారి షెడ్యూల్ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో అతడితో భద్రతాపరమైన చిక్కులు రావచ్చని భయపడింది. భర్తతో చెప్పి బాడీ గార్డు నియమించమని కూడా పురమాయించింది. అయితే, అతడితో ఎప్పటికైనా ప్రమాదం తప్పదని తలంచి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు తను చేసిన నేరాన్ని అంగీకరించారు.
Viral: కెనడాలో చెల్లాచెదురుగా చెత్త బ్యాగులు.. భారతీయులను బాధ్యుల్ని చేస్తూ పరోక్ష విమర్శలు
ఇక కోర్టు విచారణ సందర్భంగా నిందితుడి తరపు లాయర్ తన వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ మానసిక స్థితి సరిగా లేదని తెలిపాడు. ఊహాలోకంలో విహరిస్తూ అతడు యువరాణి తన ప్రేమలో ఉందని భ్రమపడినట్టు వివరించాడు. ఈ క్రమంలో అతడు తన భార్యకు విడాకులు కూడా ఇచ్చినట్టు తెలిపాడు. ఇక నిందితుడి మెడికల్ రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి అతడి మానసిక రుగ్మత ఉన్నట్టు అంగీకరించాడు.
అయితే, నిందితుడి చర్యల కారణంగా యువరాణి తీవ్ర మనోవేదనకు లోనైనట్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అబూ సలాహ్‌కు 12 నెలల కారాగార శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలయ్యాక మరో నెల రోజుల పాటు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కూడా ఆదేశించారు.
Updated Date - Dec 29 , 2024 | 01:55 PM