మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: డ్రైవింగ్ చేస్తూనే డేంజరస్ స్టంట్.. వీడియో చూస్తే గూజ్‌ బమ్స్ గ్యారెంటీ..

ABN, Publish Date - May 07 , 2024 | 09:34 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండగానే డేంజరస్ స్టంట్ చేశాడు. లారీ వేగంగా వెళ్తు్న్న సమయంలో డ్రైవర్.. ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేసి, సీటు పైనుంచి లేచాడు. డోరు తీసి ..

Viral video: డ్రైవింగ్ చేస్తూనే డేంజరస్ స్టంట్.. వీడియో చూస్తే గూజ్‌ బమ్స్ గ్యారెంటీ..

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదమని తెలిసినా ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇంకొందరు తాము నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ లారీ డ్రైవర్ చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ డ్రైవర్ (Lorry driver) డ్రైవింగ్ చేస్తుండగానే డేంజరస్ స్టంట్ (Dangerous stunt) చేశాడు. లారీ వేగంగా వెళ్తు్న్న సమయంలో డ్రైవర్.. ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేసి, సీటు పైనుంచి లేచాడు. డోరు తీసి దిగి లారీ ఇంజిన్ అద్దాల వైపు వెళ్లాడు. అలా చుట్టూ తిరిగి క్లీనర్ వైపు నుంచి డోరు నుంచి మళ్లీ లారీలోకి వస్తాడు. చివరికి మళ్లీ తన సీటులోకి వెళ్లి స్టీరింగ్ కంట్రోల్ చేస్తాడు.

Viral video: నడిరోడ్డుపై ఈ యువతి చేసిన పనికి.. పోలీసులు కూడా సిగ్గుతో..


అయితే ఈ క్రమంలో ఏమాత్రం లారీ అటూ ఇటూ వెళ్లినా.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అలాగే ముందు, వెనుక వస్తున్న వాహనాలు కూడా ప్రమాదంలో పడేవి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా లారీ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ డ్రైవర్ విన్యాసం మామూలుగా లేదుగా’’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: మెటల్ డిటెక్టర్ పదే పదే సౌండ్ చేస్తుండడంతో మట్టిలో తవ్వాడు.. చివరకు లోపల చూడగా..

Updated Date - May 07 , 2024 | 09:34 PM

Advertising
Advertising